Kavitha Jail: మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి తిహార్ జైలులో ఉన్న బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఉపశమనం లభించడం లేదు. బయటకు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. రిమాండ్‌లో ఉన్న కవిత బయటకు వచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. బెయిల్ ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి. అయితే జైలులో కవిత ఏం చేస్తున్నారు? ఆమె జీవన శైలి ఎలా ఉందోననే ఆసక్తి నెలకొంది. ఇన్నాళ్లు ప్రజాజీవితంలో బిజీబిజీగా ఉన్న కవిత ఇప్పుడు జైల్లో ఎలా ఉన్నారో అని ప్రజల్లో చర్చ మొదలైంది. బెయిల్ విషయమై కోర్టులో వాదనలు వినిపిస్తుండగా న్యాయస్థానం నిరాకరిస్తోంది. బెయిల్ ఇవ్వకపోయినా కొన్ని సౌకర్యాలు కల్పించాలని కవిత విజ్ఞప్తి చేయగా.. వాటికి మాత్రం న్యాయస్థానం సమ్మతించి కవిత కోరినవి కల్పించాలని జైలు శాఖను ఆదేశించింది.
Also Read: MLC Election Counting: రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం భారీ షాక్.. ఓట్ల లెక్కింపు వాయిదా
జైలులో ఉన్నన్నాళ్లు కవితకు పలు సదుపాయాలు కల్పిస్తున్నారు. జైలు భోజనం కాకుండా కవితకు ఇంటి భోజనం అందుతోంది. ఇక జైలులో ఉన్న కవిత పెన్నులు, పుస్తకాలు, కాగితాలు కోరారు. ఇక జైలులో ఆరోగ్యంపై కూడా కవిత దృష్టి సారించారు. యోగ, ధ్యానం చేయడానికి జపమాల కావాలని కోరగా న్యాయస్థానం సమ్మతించింది. వీటిపై వాకింగ్ కూడా కవిత చేయనున్నారు. వాటి కోసం స్పోర్ట్స్ షూ కావాలని కవిత కోరడంతో కోర్టు అంగీకరించింది. అది కూడా లేస్ లేని షూలు పంపాలని అడగడంతో కవిత కోరినన్ని అందించాలని జైలు శాఖకు న్యాయస్థానం ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు జైలు శాఖ అధికారులు కవితకు పలు సౌకర్యాలు, వస్తువులు కల్పిస్తున్నారు.
కోర్టులో వాదనలు
ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో విచారణ వాడీవేడిగా జరుగుతోంది. కవిత తరఫున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవిత ప్రస్తావన లేదని గుర్తు చేస్తున్నారు. ఈడీ నమోదుచేసిన ఎఫ్‌ఐఆర్‌లో కవిత పేరు లేకున్నా కూడా అరెస్ట్ చేశారని న్యాయవాది గుర్తుచేశారు. మొదటి, సప్లిమెంటరీ చార్జ్‌షీట్‌లో కవిత పేరు లేదని చెప్పారు. విచారణకు సహకరిస్తున్న సమయంలో కవితను అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. మధ్యంతర బెయిల్‌తోపాటు రెగ్యులర్ బెయిల్ కోరుతూ కవిత వేసిన పిటిషన్‌పై ఏప్రిల్ 4వ తేదీకి విచారణ వాయిదా పడింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook