It Raids On dil raju office and Sunitha husband Mango company: తెలంగాణలో ఉదయం నుంచి ఐటీ అధికారులు హల్ చల్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రముఖ డైరెక్టర్, ఎఫ్ డీసీ చైర్మన్ దిల్ రాజు ఇంట్లో, ఆఫీసుల్లో పోదాలు నిర్వహిస్తున్నారు. కొడుకు శిరీష్, కూతురు హన్సీత రెడ్డి, బంధువుల ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. అంతేా కాకుండా.. పుష్ప2 నిర్మాత నవీన్ ఎర్నేనీ సంస్థల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
ఉదయం నుంచి 8 ప్రాంతాలలో దాదాపు.. 55 బృందాలుగా విడిపోయి ఐటీ దాడులు నిర్వహిస్తున్నారు. అదే విధంగా ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్, సింగర్ సునీత భర్తకు చెందిన మ్యాంగో కంపెనీలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
దిల్ రాజు గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నామ్, డాకు మహారాజ్ మూవీస్ భారీ బడ్జెట్ తో అభిమానుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ కు చెందిన అన్ని చోట్ల ఐటీ అధికారులు ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో ఐటీ సోదాలతో తెలంగాణలో ఉదయం నుంచి రచ్చగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter