Bogus Pensions: బోగస్ పెన్షన్ల ఏరివేత, ఫిబ్రవరి 1 నుంచి వాళ్లందరి పింఛన్లు కట్

Bogus Pensions: ఆంధ్రప్రదేశ్‌లో భారీగా పెన్షన్లు కట్ కానున్నాయి. బోగస్ పింఛన్లపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఫిబ్రవరి 1 నుంచి వాళ్లందరి పెన్షన్ తొలగించనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 20, 2025, 10:49 AM IST
Bogus Pensions: బోగస్ పెన్షన్ల ఏరివేత, ఫిబ్రవరి 1 నుంచి వాళ్లందరి పింఛన్లు కట్

Bogus Pensions: ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పట్నించి గత ప్రభుత్వ పధకాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. అనర్హుల పేరుతో భారీగా ఏరివేత ప్రారంభించింది. పింఛన్లపై ఫోకస్ పెట్టింది. ఫిబ్రవరి 1 నుంచి పెద్దఎత్తున పెన్షన్లకు కత్తెర పడనుంది. 

ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం సంక్షేమ పధకాలపై ప్రత్యేకంగా దృష్టి సారించిన క్రమంలో గత ప్రభుత్వ హయాంలో కొనసాగిన సంక్షేమ పధకాలను పరిశీలిస్తోంది. చాలామంది అనర్హులకు గత ప్రభుత్వ హయాంలో లబ్ది చేకూరిందనే కారణంతో భారీగా తొలగింపు ప్రక్రియ చేపట్టింది. ఎలాంటి అర్హత లేకుండా పింఛన్లు తీసుకుంటున్నవారిని ఏరివేసేందుకు తనిఖీలు ప్రారంభించింది.ఇప్పటికే అలాంటి అనర్హుల్ని ప్రభుత్వం గుర్తించింది. పూర్తిగా ఆరోగ్యం క్షీణించి మంచానికే పరిమితమైన వారి కోటాలో పింఛన్లు పొందుతున్నవారిని గుర్తించింది. మరో వైపు దివ్యాంగుల కేటగరీలో అర్హత లేనివారిని గుర్తించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. గత ప్రభుత్వ హయాంలో ఈ కేటగరీలో భారీగా అనర్హులు లబ్ది పొందారనేది కూటమి ప్రభుత్వం ఆరోపణగా ఉంది. దివ్యాంగ కేటగరీలో పెన్షన్లు పొందుతున్నవారికి ప్రత్యేకంగా ఆసుపత్రుల్లో తగిన వైద్య పరీక్షలు చేయించనున్నారు. 

ఇక ఈ నెల 22 నుంచి 30 వరకు పీజీ వైద్య విద్యార్ధులు రోజుకు 200 మంది లబ్దిదారులకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 1 నుంచి పెన్షనర్ల పరిశీలన ఉంటుంది. పెన్షనర్లంతా తప్పనిసరిగా వైద్య పరీక్షలకు వెళ్లాల్సి ఉంటుంది. వైద్య పరీక్షలకు హాజరుకాకుంటే పెన్షన్ నిలిచిపోతుంది. వైద్యులు ఇచ్చే నివేదిక ఆధారంగా పెన్షన్ ఉంటుంది. 

Also read: Cold Waves: గజగజ వణికిస్తున్న చలి, ఈ జిల్లాల్లో సింగిల్ డిజిట్‌కు ఉష్ణోగ్రతలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News