Pawan Kalyan: పవన్ కోసం కాక రేపుతోన్న కాపులు.. లోకేష్ డిప్యూటీ సీఎం అయితే.. జనసేనానిని సీఎం ను చేయండి..

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంలో కొత్త చిచ్చు రేగుతోంది. ఉప ముఖ్యమంత్రి పదవి కేంద్రంగా తెలుగు దేశం,జనసేన మధ్య మాటల యుద్ధం సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. అది కూటమిలో గ్యాప్ పెరిగేలా చేస్తోంది. ఇంతకీ కూటమిలో పవన్ కళ్యాణ్ ప్రాధాన్యతపై తెలుగు తమ్ముళ్లు నోరు పారేసుకుంటున్నారు. దీంతో కాపు నేతలు రంగంలోకి దిగి పవన్ కళ్యాణ్ కు అండగా నిలుస్తున్నారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Jan 20, 2025, 04:50 AM IST
Pawan Kalyan: పవన్ కోసం కాక రేపుతోన్న కాపులు.. లోకేష్ డిప్యూటీ సీఎం అయితే.. జనసేనానిని  సీఎం ను చేయండి..

Pawan Kalyan:ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ ఉండగా.. తాజాగా టీడీపీ నేతలు నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నేతలంతా ఒక్కొక్కరుగా బయటికి వస్తూ లోకేష్ ను ఉప ముఖ్యమంత్రి చేయాలని కోరుతున్నారు. పవన్ కళ్యాణ్ కు కేంద్ర పెద్దల వద్ద ఎక్కువ ప్రాధాన్యత లభించడం వంటి కారణాలు కూడా తెలుగు దేశం నేతలను జీర్ణించుకోలే ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్టు కొంత మంది కాపు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామరాజు ఈ విషయాన్ని మొదటగా ప్రస్తావించారు. టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ శ్రీనివాస్ రెడ్డి సభలోనే లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని సీఎం చంద్రబాబును కోరారు. తాజాగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ఇదే కామెంట్ చేశారు. డిప్యూటీ సీఎం పదవికి 100 శాతం నారా లోకేష్ అర్హుడు  అంటూ ఎక్స్ లో  సోమిరెడ్డి పోస్ట్ చేశారు.

టీడీపీ నేతల కామెంట్లపై జనసేన నేతలు ఫైరవుతున్నారు. నారా లోకేష్‌ను ఎలాగైనా డిప్యూటీ సీఎంగా చూడాలని టీడీపీ అనుకూల మీడియా ఆరాటపడుతోందని జనసేన నేతలు ఎద్దేవా చేస్తున్నారు.మరోవైపు తెర వెనక చంద్రబాబు నాయుడు ఉండి ఇదంత చేయిస్తున్నారనే కామెంట్స్ చేస్తున్నారు. ముందు నుంచి చంద్రబాబు నమ్మిన వాళ్లను మోసం చేయడం ముందు నుంచే అలవాటుందంటున్నారు. పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబు సొంతం. అప్పట్లో వాజ్ పేయ్, ఆ తర్వాత నరేంద్ర మోడీలను వాడుకోని వారినే బద్నాం చేసిన చరిత్ర చంద్రబాబు అంటూ ఏకి పారేస్తున్నారు.

ఇదీ చదవండి:   గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!

ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?

అయితే లోకేష్‌ను డిప్యూటీ సీఎంను చేస్తే.. పవన్‌న కళ్యాణు  సీఎం చేయాలని డిమాండ్ చేస్తున్నారు కాపు నేతలు. ఇప్పటికే రాజకీయ నేతగా చంద్రబాబుకి వయసైపోయిందంటున్నాు.  ఆయనకు రిటైర్మెంట్‌ ఇచ్చి పవన్‌కు ఆ బాధ్యతలు అప్పజెప్పాలని చురకలంటిస్తున్నారు జన సైనికులు. మొత్తంగ సోషల్ మీడియా వేదికగా తెలుగు దేశం నేతల వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇస్తున్నారు జనసైనికులు.

ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News