Tirumala Annaprasadam: తిరుమలలో రుచికరంగా భోజనం.. అన్నప్రసాదంలో కొత్తగా మసాలా వడలు

Masala Vada Get Placed In Tirumala Annaprasadam Menu: కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వరడిని దర్శించుకునే భక్తులకు ఆకలితో అలమటించరు. లక్షలాది మంది భక్తులకు నిత్యం అన్నప్రసాదం అందిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం తాజాగా మరింత నాణ్యంగా.. రుచికరంగా అందించాలని నిర్ణయించింది. ప్రసాదంలో కొత్తగా వడ అందించాలని టీటీడీ భావిస్తోంది.

1 /6

తిరుమల కొండపై భక్తులకు కడుపునిండా అన్నప్రసాదం భోజనం అందిస్తోంది. అన్నప్రసాదాన్ని మరింత రుచికరంగా అందించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది.

2 /6

అన్నప్రసాదం మెనూలో టీటీడీ అధికారులు భారీ మార్పులు చేస్తున్నారు. ఈ భోజనంలో సరికొత్తగా మరో పదార్థం అందించాలని నిర్ణయించింది.

3 /6

అన్నప్రసాద వితరణ కేంద్రంలో భోజనంతో పాటు మసాలా వడలు పెట్టాలని టీటీడీ ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది. భక్తులకు మసాలా వడలు వడ్డించేందుకు సిద్ధమైంది.

4 /6

ఈ వడలు కూడా ఉల్లిపాయలు.. వెల్లులి లేకుండా తయారుచేయడం విశేషం. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో సోమవారం ట్రయల్ రన్ చేపట్టారు.

5 /6

ప్రయోగాత్మకంగా దాదాపు 5 వేల మంది భక్తులకు టీటీడీ అధికారులు మసాలా వడలు వడ్డించారు. వడ్డించిన మసాలా వడలు రుచిగా ఉన్నాయని భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు.

6 /6

భక్తుల నుంచి సానుకూల స్పందన లభించడంతో ఫిబ్ర‌వ‌రి 4వ తేదీ రథసప్తమి సందర్భంగా పూర్తిస్థాయిలో భక్తులందరికీ మసాలా వడలు వడ్డించాలని టీటీడీ నిర్ణయించినట్లు సమాచారం.