Kumbh mela ki Monalisa: జాక్ పాట్ కొట్టేసిన మోనాలీసా..!.. బాలీవుడ్ డైరెక్టర్ నుంచి క్రేజీ ఆఫర్..?..

Maha kumbh mela: కుంభమేళలో ప్రస్తుతం మోనాలీసా అనే యువతి ఒక్కసారిగా ఫెమస్ అయిపోయింది. సోషల్ మీడియాలో ఆమె పేరు, ఫోటోలు తెగ హల్ చల్ చేస్తున్నాయి.

1 /6

ప్రయాగ్ రాజ్ లో కుంభమేళ ఉత్సవం గ్రాండ్ గా జరుగుతుంది. ఇప్పటికే కోట్లాది మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. అంతే కాకుండా.. ప్రతి రోజు కోట్లాది మంది భక్తులు కుంభమేళకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో కుంభమేళలో సాధులు, సంత్ లు, అఘోరీలు ఎక్కువగా వార్తలలో ఉంటున్నారు.

2 /6

ఇటీవల గ్లామరస్ సాధ్వీ హర్షరిచారియా, ఐఐటీ బాబా, కేజీల కొద్ది గోల్డ్  వేసుకున్న అఘోరీ, ఛోటూ అఘోరీ, తలపై పావురం ఇలా అనేక మంది వెరైటీ అఘోరీలు వార్తలలో నిలిచారు. అంతే కాకుండా.. కొన్నిసార్లు ఈ ఫెమస్ పర్సనాలిటీస్ వార్తలలో ఉంటూ..కాంట్రవర్సీకి కూడా కేరాఫ్ గా మారుతున్నారు.   

3 /6

కుంభమేళలో ప్రస్తుతం తేనెకళ్ల అమ్మాయి మోనాలీసా పేరు సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ గా మారింది. అంతే కాకుండా.. ఆమె వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారాయి. ఆమె  ఇండోర్ కు చెందిన యువతి. కుంభమేళలో రుద్రాక్షలు, జపమాలలు అమ్ముకునేందుకు వచ్చారు.

4 /6

మరీ ఆమెను ఎవరు ఇంటర్వ్యూ చేశారో.. కానీ ఒక్కసారిగా ఆమె సోషల్ మీడియాలో షేక్ చేస్తున్నారు. ఆమెను ఇంటర్వ్యూ చేసేందుకు యూట్యూబర్ లు, మీడియా వాళ్లు ఆమెను తెగ ఇబ్బంది పెడుతున్నారు. దీని వల్ల మోనాలీసా చాలా ఇబ్బంది పడుతుంది.  

5 /6

తన బిజినెస్ దీని వల్ల చాలా దెబ్బతింటోందని, ప్రతి రోజు వందలాది మంది తనతో ఫోటోలు, వీడియోలు, రీల్స్ చేసేందుకు తన దగ్గరకు వస్తున్నారని మోనాలీసా చెప్పుకొచ్చారు. అంతేకాకుండా.. కొందరు తనతో అసభ్యంగా ప్రవర్తించిన సందర్భాలు ఉన్నాయని ఆమె బాధపడ్డారు. 

6 /6

ఈ క్రమంలో మోనాలీసాకు ఒక బాలీవుడ్ డైరెక్టర్ నుంచి క్రేజీ ఆఫర్ వచ్చిందని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడిదీ వైరల్ గా  మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. కుంభమేళ పుణ్యామా.. అని ఆమె తల రాతే మారిపోయిందని కూడా చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్లు సైతం చేస్తున్నారు.