Kolkata Doctor Murder case: మమతా బెనర్జీ మరో సంచలనం.. ఆర్జీకర్ ఘటన తీర్పుపై హైకోర్టులో పిటిషన్..

Junior doctor murder case: కోల్ కతలో వైద్యురాలి హత్యపై ఇటీవల సిల్దా కోర్టు జీవిత ఖైదును శిక్షను ఖరారు చేసింది. ఈ క్రమంలో దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి.

Written by - Inamdar Paresh | Last Updated : Jan 21, 2025, 12:34 PM IST
  • సీల్దా కోర్టు తీర్పుపై సర్వత్రా నిరసనలు..
  • ఇదెక్కడి న్యాయమంటూ గగ్గొలు..
Kolkata Doctor Murder case: మమతా బెనర్జీ మరో సంచలనం.. ఆర్జీకర్ ఘటన  తీర్పుపై హైకోర్టులో పిటిషన్..

Kolkata junior doctor muder case update: గతేడాది వెస్ట్ బెంగాల్ లోని ఆర్జీకర్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలిని అత్యంత ఘోరంగా అత్యాచారం చేసి హతమార్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆగస్టు 9 న సెమినార్ హల్ లో జూనియర్ వైద్యురాలు దారుణంగా హత్యగావించబడింది. ఈ ఘటన దేశంలోనే సంచలనంగా మారింది. దీనిపై.. దేశ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు నిరసనలు చేపట్టారు. ఘటన ప్రదేశంలో నిందితుడు సంజయ్ రాయ్ ఇయర్ బడ్స్ దొరికాయి. అంతేకాకుండా.. యువతి శరీరంలో పోస్ట్ మార్టం నివేదికలో ఆమెను అత్యాచారం చేసి హతమార్చినట్లు నివేదికలు వచ్చాయి.

ఘటన ప్రదేశంలోని ఆనవాళ్లు,యువతి శరీరం మీద లభించిన ఆనవాళ్లతో.. సంజయ్ రాయ్ ఆనవాళ్లు ఒక్కటే అని పోలీసులు తెల్చారు. దీనిపై విచారణ జరిపిన సీబీఐ కోర్టు వారికి నివేదికను సమర్పించింది.దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ ఘటనలో సంజయ్ రాయ్ ను కోల్ కతాలోని సీల్దా కోర్టు నేరస్థుడిగా తెల్చింది. అంతే కాకుండా. . నిందితుడు సంజయ్ రాయ్ కు జీవిత ఖైదు శిక్షను ఖరారు చేసింది.

అదే విధంగా 50 వేల జరిమానను విధించింది. జూనియర్ వైద్యురాలికి వెస్ట్ బెంగాల్ సర్కారు.. 17 లక్షల రూపాయలు పరిహారంగా ఇవ్వాలని న్యాయస్థానం తీర్పును వెలువరిచింది. ఈ తీర్పుపై దేశ వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. వెస్ట్ బెంగాల్ సీఎం మమత సైతం..ఈ తీర్పును వ్యతిరేకించారు. ఇలాంటి తీర్పులు న్యాయవ్యవస్థపై గౌరవాన్ని తగ్గించేలా చేస్తాయని  ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

Read more: Kolkata murder case: ఆర్జీకర్ ఘటనపై తీర్పు.. షాకింగ్ కామెంట్స్ చేసిన మమత బెనర్జీ.. ఏమన్నారంటే..?

దీనిపై జూనియర్ డాక్టర్ కుటుంబ సభ్యులుకూడా తీవ్ర మనోవేదనలు గురౌతున్నారు. తమ కూతుర్ని పొట్టన్న పెట్టుకున్న వాడికి.. మరణ శిక్ష సరైందని... దీని కోసం తాము పోరాడుతునే ఉంటామన్నారు. మరోవైపు.. సీల్దా ట్రయల్  కోర్టు తీర్పుపై.. తాము హైకోర్టులో సవాల్ చేస్తామని మమతా బెనర్జీ వెల్లడించారు. సంజయ్ రాయ్ తల్లి, సోదరి సైతం.. తప్పు చేస్తే వదిలేదని లేదని అన్నారు. ఇలాంటి నేపథ్యంలో కోర్టు తీర్పు పట్ల ప్రజలంతా ఆగ్రహాంతో ఉన్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News