New Ration Card Apply in Telangana: తెలంగాణ కొత్త రేషన్ కార్డులకు అర్హులను ప్రభుత్వం ప్రకటించింది ప్రభుత్వం. 2014 నాటి మార్గదర్శకాలనే ప్రాతిపదికగా తీసుకుంది.గ్రామాల్లో కుటుంబ వార్షిక ఆదాయం లక్షన్నర రూపాయలు.. పట్టణాల్లో అయితే రెండు లక్షలుగా నిర్ణయించారు. అలాగే గ్రామాల్లో మూడున్నర ఎకరాలు అంతకంటే తక్కువ విస్తీర్ణంలో మాగాణి పొలం ఉన్న రైతులు.. ఏడున్నర ఎకరాలు అంతకంటే తక్కువ మెట్ట భూములు ఉన్న రైతులు అర్హులుగా తేల్చారు.
కొత్త కార్డుల కోసం జనవరి 21 నుంచి 24 వరకు గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. తెలంగాణలో లక్షలాది కుటుంబాలు ఎంతో కాలంగా కొత్త కార్డుల కోసం ఎదురుచూస్తున్నాయి. దీంతో కొత్త కార్డుల జారీ దిశగా సర్కారు ముందడుగు వేసింది. దీనికి సంబంధించిన 10 ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి.ఆధ్వర్యంలో కొత్త రేషన్ కార్డులు జారీ కానున్నాయి. లక్షలాది కుటుంబాలు ఎన్నో ఏళ్లుగా కొత్త కార్డుల కోసం ఎదురుచూస్తున్నాయి. దీంతో కొత్త కార్డుల జారీ దిశగా ప్రభుత్వం ముందడుగు వేసింది.
మంత్రివర్గ ఉపసంఘం సిఫారసులకు అనుగుణంగా కొత్త రేషన్ కార్డులకు అర్హులు ఎవరనే దానిపై ఎంపిక జరగనుంది. రేషన్ కార్డు దరఖాస్తులను క్షుణ్గంగా తనిఖీ చేసి తర్వాత కుల గణన సర్వే ఆధారంగా రేషన్ కార్డులు లేని కుటుంబాల జాబితాను జిల్లా కలెక్టర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు పంపిస్తారు.
మండల స్థాయిలో ఎంపీడీవో, యూఎల్‌బీలో మున్సిపల్ కమిషనర్ ఈ ప్రక్రియకు బాధ్యులుగా ఉంటారు. రేషన్ కార్డు ముసాయిదా డ్రాఫ్ట్ ను గ్రామసభ, వార్డులో ప్రదర్శిస్తారు. లబ్ధిదారుల పేర్లను చదివి వినిపించి చర్చించిన తర్వాత ఆమోదిస్తారు.
ఆహార భద్రత కార్డుల్లో కుటుంబ సభ్యులను కొత్తగా చేర్చనున్నారు. అర్హత కలిగిన కుటుంబాలకు ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నారు.రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటే.. ముందుగా దరఖాస్తు ఫారమ్ నింపాలని అధికారులు ప్రాథమికంగా చెబుతున్నారు. దరఖాస్తు ఫారం మీసేవా కేంద్రంలో లేదా మీసేవా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండనుంది. మీసేవా సర్వీస్ ఫారమ్‌లపై క్లిక్ చేస్తే.. అక్కడ వివిధ విభాగాల ఫారాలు కనిపిస్తాయి. అప్పుడు పౌర సరఫరాల శాఖ ఎంపికపై క్లిక్ చేయాలి.
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
ఆహార భద్రతా కార్డ్ కోసం దరఖాస్తు ఆప్షన్ కనిపిస్తుంది.దానిపై క్లిక్ చేయాలి.దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసిన తర్వాత.. ప్రింట్ అవుట్ తీసుకోవాలి.దరఖాస్తుదారు పేరు, వయస్సు, లింగం, తండ్రి, పేరు, చిరునామా వివరాలతో సహా.. మొబైల్ నంబర్, అవసరమైన అన్ని సమాచారాన్ని దరఖాస్తు ఫారమ్‌లో పూరించాలి. అర్హత వివరాలు, జిల్లా, ప్రాంతం, కుటుంబ సభ్యుల సంఖ్య, కుటుంబం ఆదాయం మొదలైన వివరాలు నమోదు చేయాలి.
అన్ని పత్రాలను జతచేసి, దరఖాస్తు ఫారమ్‌ను నిర్ణీత రుసుముతో మీసేవా కేంద్రంలో సమర్పించాలి. తీసుకున్నట్టు అక్నాలడ్జ్ మెంట్ స్లిప్ తీసుకోవడం మర్చిపోవద్దు. దరఖాస్తు చేయడానికి.. నివాస రుజువు ధ్రువీరకణ పత్రం, ఆధార్ కార్డు జిరాక్స్, దరఖాస్తుదారుడి పాస్‌పోర్ట్ సైజు ఫోటో అవసరం ఉంటుందని అధికారులు తెపలిరాు. దీంట్లో ప్రభుత్వం మార్పులు, చేర్పులు చేసే అవకాశం కూడా ఉంటుంది.
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.