Meat Pieces In Temple: తెలంగాణలో తరచూ ఆలయాల విధ్వంసంతోపాటు పూజారులపై దాడులు జరుగుతున్న సమయంలో ఓ ఆలయంలో మాంసం ముక్కలు ప్రత్యక్షం కావడం తీవ్ర కలకలం రేపింది. పవిత్రమైన ఆలయంలో మాంసం ముక్కలు కనిపించడం తీవ్ర రాజకీయ దుమారం రేపింది. రోజంతా హైడ్రామా కొనసాగగా.. చివరకు ఆ మాంసం ఆలయంలో ఎవరూ తీసుకెళ్లారనే అంశం వెలుగులోకి వచ్చింది. ఆలయంలోకి మాంసం ఎవరు తీసుకెళ్లారనేది పోలీసులు వెల్లడించారు. వేసింది ఎవరో తెలుసుకుని అందరూ విస్తుపోయారు.
Also Read: Success Story: చిల్లీగవ్వ లేకుండా రైలు ఎక్కిన ఆ టీనేజర్.. ఇప్పుడు రూ.లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం
హైదరాబాద్ పాతబస్తీలోని టప్పాచబుత్ర జిర్ర ప్రాంతంలో హనుమాన్ ఆలయంలో బుధవారం శివలింగం వెనుక మాంసం ముక్క కనిపించింది. ఆలయంలో మాంసం చూసి భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా వారు వచ్చి విచారణ చేపట్టారు. మాంసం ముక్క పడి ఉండడంపై హిందూ సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. రాజకీయ నాయకులు, భక్తులు ఆందోళన చేపట్టడంతో పోలీసులు ఈ ఘటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
Also Read: Kalvakuntla Kavitha: 'తెలంగాణలోని ప్రతి మహిళకు రేవంత్ రెడ్డి రూ.35 వేలు ఇవ్వాలి'
ఉదయం నుంచి ఈ ఘటనపై విచారణ తీవ్రంగా చేశారు. ఆలయం ప్రాంతంలోని 17 సీసీటీవీ కెమెరాలు పరిశీలించారు. రాత్రి నుంచి ఉదయం వరకు ఆలయంలోకి ఎవరూ వచ్చిన ఆనవాళ్లు కనిపించలేదు. దీంతో మాంసం ముక్క ఎలా వచ్చిందని ఆ కోణంలో విచారణ చేపట్టారు. సీసీటీవీ కెమెరాలను నిశితంగా పరిశీలించగా అనుకోని దృశ్యం కనిపించింది. నోట్లో మాంసం పట్టుకొని ఆలయంలో పిల్లి వేసినట్లు గుర్తించారు. రోడ్డుపై మాంసం పట్టుకువెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. ఇంతటి రాజకీయ వివాదానికి కారణమైన ఘటనలో పిల్లి దోషి కావడం గమనార్హం.
మాంసం ముద్దను పిల్లి తీసుకొచ్చి వేసిందని సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చంద్ర మోహన్ ప్రకటించారు. ఎవరూ ఆలయంలో మాంసం వేయలేదని నిర్ధారించారు. అంతకుముందు ఘటనా స్థలాన్ని సీపీ విక్రమ్‌సింగ్ మాన్ కూడా పరిశీలించారు. ఈ ఘటనకు పిల్లి కారణం కావడంతో సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. పిల్లి తీసుకురావడంతో నెలకొన్ని ఉద్రిక్త పరిస్థితులు తొలగిపోయాయి. వివాదం సద్దుమణగడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.