Another key development in the Telugu Academy deposit case Canara Bank manager arrest: తెలుగు అకాడమీ డిపాజిట్ కేసులో (Telugu Academy deposit case) మరో కీలక పరిమాణం చోటుచేసుకుంది. తాజాగా చందానగర్ కెనరా బ్యాంక్ మేనేజర్ సాధనను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటి వరకు తెలుగు అకాడమీ డిపాజిట్ల స్కాంలో (Telugu Academy deposit case) పది మందిని పోలీసులు అరెస్టు చేశారు. అలాగే ఈ కేసులో ఏజెంట్‌లైన వెంకట్, సాయి, రాజ్ కుమార్, సోమశేఖర్‌లను అరెస్టు చేశారు పోలీసులు. వీరు గతంలోనూ పలు స్కాంలకు పాల్పడినట్లు తేల్చారు. యూబీఐ (UBI) మేనేజర్ మస్తాన్ వలితో కుమ్మకైన నిందితులు తెలుగు అకాడమీ డిపాజిట్లు కాజేసినట్లు సీసీఎస్ పోలీసులు (CCS Police) వెల్లడించారు.
Also Read : Lakhimpur Kheri: ఒక్క ఆధారం చూపించినా..మంత్రి పదవికి రాజీనామా చేస్తా
ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు ఈ ముఠా స్కాంకు (Scam) పాల్పడింది. మూడు బ్యాంకుల నుంచి కోట్ల రూపాయలు డ్రా చేసింది ఈ ముఠా. డిసెంబర్‌కల్లా తెలగు అకాడమీకి (Telugu Academy ) చెందిన 324 కోట్ల రూపాయలు మొత్తం కొట్టేయాలని స్కేచ్ వేసింది ఈ ముఠా. కమిషన్‌ల ఎర చూపి బ్యాంక్ అకాడమీ సిబ్బందిని ముగ్గులోకి దింపారు ఆ ఏజెంట్లు.
అలాగే ఈ తెలగు అకాడమీ (Telugu Academy ) స్కామ్‌లో సీసీఎస్ పోలీసులు గత వారం నలుగురిని అరెస్టు చేశారు. మస్తాన్ వలీతోపాటు ఏపీ మర్కంటైల్ సొసైటీ చైర్మన్ సత్యనారాయణ, మేనేజర్ పద్మావతి, క్లర్క్ మొహిద్దీన్‌లను అరెస్టు చేశారు.
Also Read : Samantha, Naga Chaitanya divorce: చైతూ, సమంత విడాకులపైనే వెంకటేష్ పోస్ట్ పెట్టాడా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook