Oneplus 13 Price In India: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ Amazon Indiaలో డిస్కౌంట్ ఆఫర్స్ ప్రారంభమయ్యాయి. అత్యధిక తగ్గింపు ధరలతోనే కొన్ని ఎలక్ట్రిక్ వస్తువులు లభిస్తున్నాయి. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్స్ అత్యధిక డిస్కౌంట్ ఆఫర్స్ మధ్య అందుబాటులో ఉన్నాయి. ఈ డిస్కౌంట్ సేల్‌లో వన్‌ప్లస్ మొబైల్స్ కొనుగోలు చేయాలనుకునేవారికి అద్భుతమైన ఛాన్స్‌గా భావించవచ్చు. గతంలో విడుదలైన OnePlus 13 స్మార్ట్‌ఫోన్ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌పై లభిస్తున్న ఆఫర్స్ ఏంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుతం ఈ OnePlus 13 స్మార్ట్‌ఫోన్ అత్యధిక డిస్కౌంట్‌తో లభిస్తోంది. ముఖ్యంగా దీని ధరపై ఏకంగా రూ. 5,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అయితే దీనిని Amazon India ప్రత్యేకమైన సేల్‌లో భాగంగా కొనుగోలు చేస్తే దాదాపు భారీ బ్యాంక్ తగ్గింపు లభిస్తోంది. దీనిని HDFC బ్యాంక్, OneCard లేదా RBL బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లతో కొనుగోలు చేసేవారికి దాదాపు రూ.5 వేల వరకు తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది.
అమెజాన్‌లో వన్‌ప్లస్ ఈ మొబైల్‌పై ఫిబ్రవరి 11 నుంచి ఫిబ్రవరి 16 వరకు ఈ డిస్కౌంట్ ఆఫర్ ఉంటుంది. “రెడ్ రష్ డేస్” సేల్‌లో భాగంగా ఈ తగ్గింపును అందిస్తున్నట్లు అమెజాన్ వెల్లడించింది. అలాగే ఈ మొబైల్‌పై అదనంగా ఎక్చేంజ్ ఆఫర్ కూడా లభిస్తోంది. దీని కోసం వినియోగిస్తున్న పాత వన్‌ప్లస్ మొబైల్ ఎక్చేంజ్‌గా ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాదాపు రూ.7,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ ఏకంగా ఈ స్మార్ట్‌ఫోన్‌పై దాదాపు రూ. 12 వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు.
అలాగే ఈ OnePlus 13 స్మార్ట్‌ఫోన్‌ను ఇప్పుడే కొనుగోలు చేసేవారికి నో కాస్ట్ EMI ఆప్షన్ కూడా లభిస్తోంది. సెలక్టెడ్ బ్యాంక్‌లను వినియోగించి EMI ఆప్షన్‌లో కొనుగోలు చేస్తే ఈ నో కాస్ట్ EMI ఆప్షన్ అందుబాటులో ఉంది. ఈ డిస్కౌంట్ ఆఫర్స్‌తో పాటు ఇతర ప్రత్యేకమైన బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఈ మొబైల్ అద్భుతమైన ఫీచర్స్‌తో పాటు శక్తివంతమైన కెమెరాలతో అదుబాటులో ఉంది. కాబట్టి భారీ తగ్గింపుతో కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే బెస్ట్ టైమ్‌గా భావించవచ్చు.
AlsoRead: HMPV Virus: దేశంలో వేగంగా వ్యాపిస్తున్న హెచ్ఎంపీవీ, ఏం చేయాలి, ఏం చేయకూడదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి