Nothing 3a Series: ప్రముఖ బ్రిటీషు కంపెనీ నథింగ్ నుంచి Nothing 3a , Nothing 3a ప్రో లాంచ్‌కు అంత సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా మార్చ్ 4న ఈ ఫోన్ మార్కెట్‌లో రానుంది. 50 మెగాపిక్సెల్ కెమేరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో నథింగ్ కొత్త మోడల్ ఫోన్లపై మార్కెట్‌లో చాలా అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఫీచర్లు లీకవడంతో ఇంకా అంచనాలు పెరిగాయి.
Nothing 3a సిరీస్ ఫోన్ 6.8 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి ప్లస్ ఎమోల్డ్ డిస్‌ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. వీటిలో క్వాల్‌కామ చిప్‌సెట్ ఉండటంతో పనితీరు ఇతర ఫోన్లతో పోలిస్తే చాలా వేగంగా ఉంటుంది. సూపర్ ఫాస్ట్ న్యూరల్ ప్రోసెసింగ్ యూనిట్ ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 7 ఎస్ జనరేషన్ 3 చిప్‌సెట్ ఉంటుందని తెలుస్తోంది. మరోవైపు 8జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ వెర్షన్‌తో పాటు 12 జీబీ ర్యామ్-256 జీబీ స్టోరేజ్ మోడల్స్ ఉంటాయి. Nothing 3a సిరీస్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరా, 2 ఎక్స్ ఆప్టికల్ జూమ్ కలిగిన 50 మెగాపిక్సెల్ టెలీఫోటో లెన్స్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్‌తో ట్రిపుల్ కెమేరా సెటప్ ఉండటం ప్రత్యేక. ఇక సెల్ఫీ లేదా వీడియో కాలింగ్ కోసం 32 మెగాపిక్సెల్ కెమేరా ఉంటుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం ఉండి, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.
Nothing 3a బేసిక్ మోడల్ అంటే 8జీబీ ర్యామ్-128 జీబీ స్టోరేజ్ వెర్షన్ ధర 32వేలు ఉండవచ్చని తెలుస్తోంది. నలుపు, తెలుపు రెండే రంగుల్లో అందుబాటులో ఉంటుంది. ఇందులోనే 12 జీబీ ర్యామ్-256 జీబీ స్టోరేజ్ వెర్షన్ అయితే 43 వేలు ఉంటుంది. ఈ మోడల్ ఫోన్ 43 వేలు ఉండవచ్చని అంచనా. ఇదే Nothing 3a ప్రో మోడల్. Nothing 3a అమ్మకాలు మార్చ్ 11 నుంచి ప్రారంభం కానుండగా, Nothing 3a ప్రో విక్రయాలు మార్చ్ 25 నుంచి ఉంటాయి.
Also read: Drishyam 3: దృశ్యం సినిమా అభిమానులకు గ్రేట్ న్యూస్, దృశ్యం 3 అధికారిక ప్రకటన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి