Kodali Nani Gudivada Casino issue : కొడాలి కన్వెన్షన్ సెంటర్లో క్యాసినో నిర్వహించారంటూ ఆరోపణలు రావడంతో.. గుడివాడకు వెళ్లిన టీటీపీ నిజనిర్ధారణ కమిటీ. దీంతో మంత్రి కొడాలి నాని నియోజకవర్గమైన గుడివాడలో భారీగా పోలీసు బందోబస్తు నిర్వహించారు.
Nara Bhuvaneshwari: ఏపీ అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) వెక్కి వెక్కి ఏడ్చిన ఘటనపై ఆయన సతీమణి నారా భువనేశ్వరి స్పందించినట్లు తెలుస్తోంది. ఆమె నుంచి అధికారిక స్పందన ఏమీ రానప్పటికీ... కుటుంబ సన్నిహిత వర్గాల ద్వారా పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.
Purandheswari supports Bhuvaneshwari: తన సోదరి నారా భువనేశ్వరిపై జరుగుతున్న వ్యక్తిత్వ హననం తనను తీవ్రంగా కలచివేసిందని దగ్గుబాటి పురంధేశ్వరి ట్విట్టర్ ద్వారా స్పందించారు. నైతిక విలువల విషయంలో తాము రాజీపడే ప్రసక్తే లేదన్నారు.
Chandrababu Naidu sensational decision: అసెంబ్లీలో టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. వైసీపీ నేతలు తనను రాజకీయంగా, వ్యక్తిగతంగా తీవ్ర అవమానాలకు గురిచేస్తున్నారని వాపోయారు. మళ్లీ సీఎం అయ్యాకే సభలో అడుగుపెడుతానని శపథం చేశారు.
AP Municipal Elections 2021 Results Live: ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు నగరపాలక సంస్థ, కుప్పం సహా 12 మున్సిపాలిటీలతో పాటు సోమవారం పోలింగ్ జరిగిన అన్ని చోట్ల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇందులో ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో 9 మున్సిపాలిటీలను అధికార పార్టీ వైఎస్సార్సీపీ (YSRCP) కైవసం చేసుకుంది.
Jaggayyapeta Municipal Election Counting : జగ్గయ్యపేట నాలుగో వార్డులో వైఎస్సార్సీపీ (YSRCP) తరఫున పోటీ చేసిన అభ్యర్థిపై.. టీడీపీ (TDP) అభ్యర్థి సూర్యదేవర ఉషారాణి (Usharani) 14 ఓట్లతో గెలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అనంతరం ఇరుపక్షాల ఏజెంట్లు సంతకాలు చేయటంతో గెలిచిన, ఓడిన అభ్యర్థులు ఇద్దరూ కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు.
AP MPTC And ZPTC Elections 2021 held peacefully : వివిధ కారణాలతో అప్పట్లో ఆగిపోయిన, గెలిచినవారు చనిపోయిన కారణంగా ఆయా స్థానాల్లో ఎన్నికలు సాగుతున్నాయి. ఇవికాకుండా గతంలో ఓట్ల లెక్కింపు సమయంలో తడిసిన ఓట్ల కారణంగా లెక్కింపు ఆగిపోయిన జమ్మలమడుగు జెడ్పీటీసీ స్థానంలో రెండు బూత్‌లతోపాటు మరో ఆరు ఎంపీటీసీ స్థానాల్లోను మంగళవారం ఫ్రెష్ పోల్ నిర్వహిస్తున్నారు.
Perni Nani fire on tdp: అమరావతి రైతుల పేరుతో రియల్ ఎస్టేల్ వ్యాపారులు.. చంద్రబాబు ఏజెంట్లు, బినామీలు పాదయాత్ర చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు పేర్ని నాని. ఇక ఈ యాత్రకు నిర్మాత, దర్శకుడు, స్క్రీన్‌ప్లే చంద్రబాబేనంటూ విమర్శించారు. టీడీపీ నేతలు చేపట్టిన ఈ యాత్రకు చందాల పేరుతో చంద్రబాబు అండ్ కో నల్లధనాన్ని (Black money) తెల్లధనంగా మార్చుకుంటున్నారని ఆరోపించారు.
గత నవంబర్‌లో సెకీ పిలిచిన టెండర్లలో గుజరాత్ రాష్ట్రం ఒక యూనిట్ సౌర విద్యుత్‌ను రూ.1.99కే కొనుగోలు చేసిందని పయ్యావుల కేశవ్ గుర్తుచేశారు.ఏపీ ప్రభుత్వం మాత్రం ఒక యూనిట్‌కు రూ.2.49 వెచ్చించి సెకీ నుంచి విద్యుత్ కొనుగోలు చేసిందన్నారు.
Chandrababu Naidu aggressive comments: దీపావళి రోజున నామినేషన్లు వేయమనడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. ఆంధ్రప్రదేశ్‌లో మిగిలిన స్థానిక సంస్థల్లో ఎన్నికల నిర్వహణ ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) (State Election Commission) నేటి నుంచే ప్రారంభించడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) స్వతంత్రంగా వ్యవహరిస్తోందా అని ప్రశ్నించారు.
Chandrababu Naidu: తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఆత్మ పరిశీలనలో దిగింది. ఎన్నికలకు దూరంగా ఉండాలనే నిర్ణయాన్ని మార్చుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని తిరిగి నిర్ణయించుకుంది. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఏమన్నారంటే.
Badvel Bypoll: ఆంధ్రప్రదేశ్ బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక మరి కాస్సేపట్లో ప్రారంభం కానుంది. బద్వేలు అధికార పార్టీ ఎమ్మెల్యే హఠాన్మరణంతో అనివార్యమైన ఉపఎన్నికకు ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు.. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఫోన్ చేసి మాట్లాడారు. ఏపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలను అమిత్ షాకు చంద్రబాబు వివరించినట్టు తెలుస్తోంది.
Badvel Bypoll: ఏపీ, తెలంగాణల్లో జరుగుతున్న బద్వేలు, హుజూరాబాద్ ఉపఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడింది. బద్వేలు బరిలో త్రిముఖపోరు నెలకొంది. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పోటీ నుంచి తప్పుకోవడం విశేషం.
Threat to Pattabhi: తెలుగుదేశం పార్టీ నేత పట్టాభి విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే. పట్టాభికి ప్రాణహాని ఉందంటూ సంచలనం రేపారు. అదేంటో చూద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.