Chandrababu Naidu sensational decision: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) సంచలన నిర్ణయం తీసుకున్నారు. మళ్లీ సీఎం అయ్యాకే అసెంబ్లీలో అడుగుపెడుతానంటూ శపథం చేశారు. అంతవరకూ సభలో అడుగుపెట్టేది లేదని తేల్చి చెప్పారు. నిండు సభలో పార్టీ పరంగా, వ్యక్తిగతంగా తనను అత్యంత అవమానాలకు గురిచేశారని చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. సభలో (Andhra Pradesh Assembly) ఆయన మాట్లాడుతుండగానే స్పీకర్ మైక్ కట్ చేశారు. అనంతరం తన ఛాంబర్లో అత్యవసరంగా టీడీఎల్పీ సమావేశం నిర్వహించిన చంద్రబాబు... ఇక సభకు హాజరుకావొద్దని నిర్ణయం తీసుకున్నారు.
అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) మాట్లాడుతూ.. '1978 నుంచి ఎంతోమంది హేమాహేమీలతో ఈ సభలో పనిచేశాను. జాతీయ స్థాయిలోనూ అనేక మంది పెద్దలతో పనిచేశాను. కానీ అధికారపక్షంలో ఉన్నప్పుడైనా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా ఇలాంటి అవమానాలు, అనుభవాలు ఎప్పుడూ ఎదురుకాలేదు. గడిచిన రెండున్నరేళ్లలో నన్ను చాలా అవమానాలకు గురిచేశారు. ఆఖరికి నా భార్య విషయం కూడా సభలో ప్రస్తావించారు. నా కుటుంబ సభ్యులను రోడ్డు పైకి లాగారు. గతంలో ఎన్నో సభల్లో ఎన్నో చర్చలు చూశాం కానీ... ఇంత అవమానం ఎదుర్కోలేదు. ఈ సభలో పడరాని అవమానాలు పడ్డాను..' అని చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. ఆయన ఇంకా మాట్లాడుతుండగానే స్పీకర్ మైక్ కట్ చేశారు. దీంతో సభకు నమస్కారం పెట్టి టీడీపీ (TDP) సభ్యులతో కలిసి చంద్రబాబు వాకౌట్ చేశారు.
Also Read: వర్షాలపై సీఎం జగన్ సమీక్ష.. వరద సమీక్షకు ప్రత్యేక అధికారులు నియామకం
అంతకుముందు, టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తోసిపుచ్చారు. అనంతరం వ్యవసాయంపై చర్చ సందర్భంగా మంత్రి కొడాలి నాని (Kodali Nani) తమపై వ్యక్తిగత దూషణలకు దిగాడని టీడీపీ నేతలు ఆరోపించారు. మంత్రి కన్నబాబు, వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు సైతం వ్యక్తిగత దూషణలకు ఆస్కారమిచ్చేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తున్నారు. టీడీఎల్పీ సమావేశంలోనూ చంద్రబాబు (Chandrababu Naidu) భావోద్వేగానికి లోనైనట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఒకానొక దశలో ఆయన కంటతడి పెట్టుకున్నట్లు సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook