Cold Waves Alert in Telangana: కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టేశాం. చలి తీవ్రత కూడా నిన్నటి వరకు తగ్గింది అన్న తరుణంలో మళ్లీ ఈరోజు పుంజుకుంది. చలి పంజా విసురుతోంది. దీంతో రానున్న నాలుగు రోజులపాటు ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోతాయని హైదరాబాద్ వాతవరణ శాఖ హెచ్చరించింది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతుంది చలి పంజా విసురుతుంది. ఈ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని ప్రధాన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయని తెలిపింది.
పొగ మంచు విపరీతంగా పేరుకుంటుంది. కాబట్టి ఉదయం, రాత్రి వేళలో ప్రయాణించేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.
పటాన్‌చేరు అత్యల్పంగా 13 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే పరిస్థితి. అరకు, మినమలూరు 12, చింతపల్లిలో 16 డిగ్రీలు నమోదు అయ్యాయి.
చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో పొగ మంచు కూడా ఆకాశంలో తీవ్రంగా పేరుకుంటుంది. ఈ నేపథ్యంలో ఉదయం వాహనాలు నడిపే వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
ముఖ్యంగా వాహనాలు లైట్లు వేసుకొని మాత్రమే వెళ్లాలి ప్రమాదాన్ని తగ్గించవచ్చు. అంతేకాదు ఈ సమయం లో ఆరోగ్యం పై కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వృద్ధులు చంటి పిల్లల జాగ్రత్తగా చూసుకోవాలని సూచించింది.