దేశ వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన గుజరాత్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. గెలుపు ముంగిట వరకు వెళ్లి కాంగ్రెస్ ఓటమి పాలవడంపై ఆ పార్టీ ఆత్మపరిశీలన చేసుకుంటోంది. ఇకాస్త కష్టపడి ఉంటే విజయం దక్కేదని విశ్లేషణలు చేసుకుంటున్నారు. చాలా నియోజకవర్గాల్లో హోరాహోరీ పోటీ సాగినట్టు స్పష్టమైంది. చాలా చోట్ల బీజేపీ అభ్యర్ధులు బొటాబొటీ మెజారిటీతో గెలుపొందారు.. ముఖ్యంగా 16 చోట్ల గెలుపొందిన.. ఓడిపోయిన అభ్యర్థుల మధ్య ఓట్ల తేడా 200 నుంచి 2 వేల ఓట్లలోపే ఉండటం గమనార్హం. ఏదిఏమైనప్పటికీ గుజరాత్ లో 22 ఏళ్ల బీజేపీ పాలనకు చరమగీతం పాడాలన్న ఏకైక లక్ష్యంతో బరిలోకి దిగిన కాంగ్రెస్..
గుజరాత్లో అధికారం కోసం కాంగ్రెస్ ఏ స్థాయిలో ప్రచారం చేసిందనే విషయం అందరికీ తెలిసిందే. ఏకంగా ఆ పార్టీ అధ్యక్షుడు తన శాయశక్తులు వడ్డి విస్తృత ప్రచారం చేసినా ఫలితం అనుకూలంగా రాలేదంటే కారణం ఏంటి ? ఒక్క బీజేపీలోనే రెబల్స్ తిరుగుబాటు, వివిధ వర్గాల అసంతప్తి, నోట్ల రద్దు, జీఎస్టీ, రిజర్వేషన్ల కోసం పోరుబాట.. ఇలా ఒకటేంటి అనేక అంశాలు బీజేపీని అంతర్గతంగా ఇబ్బంది పెట్టినప్పటికీ కాంగ్రెస్ ఎందుకు గెలువలేపోయిందనే టాక్ బలంగా వినిపిస్తోంది. మరోవైపు మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు యత్నిస్తున్న భాజపాకు ‘అభివృద్ధి’ ఎజెండా తప్ప మరో మార్గం లేదు.
ప్రస్తుత లెక్కల ప్రకారం ఓట్లలెక్కింపులో ఇప్పటికి 77 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉండగా.. కాంగ్రెస్ 48 స్థానాల్లో ఓట్లలెక్కింపులో ఆధిక్యంలో ఉంది. హిమాచల్ ప్రదేశ్‌లో ఓట్ల లెక్కింపులో బీజేపీ 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. కాంగ్రెస్ 2 స్థానాల్లో ముందుంది.
గుజరాత్ రాష్ట్రంలో 182 అసెంబ్లీ సీట్లగాను జరిగిన ఎన్నికల ఫలితాలు ఈ రోజు సాయంత్రం కల్లా వెలువడనున్నాయి. కౌంటింగ్ మాత్రం సరిగ్గా ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది.
గుజరాత్ రెండో దశ ఎన్నికల్లో భాగంగా పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మదాబాద్‌లోని వెజల్ పూర్లో ఏర్పాటు చేసిన 961వ పోలింగ్ బూత్‌లో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ క్యూ లైన్లో నిల్చుని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గుజరాత్ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ మెహసనలోని కాడి పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. తన సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ నేత జీవాభాయి పటేల్ పై నితిన్ పటేల్ పోటీ చేస్తున్నారు. పటిదార్ అనామత్ ఆందోళన్ సమితి అధ్యక్షుడు హార్ధిక్ పటేల్ విరామ్ గ్రామ్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరితో పాటు పలువురు ప్రముఖలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.