Who is Next India Coach: రాహుల్ ద్రావిడ్ పదవీ కాలం ఈ ఏడాది వరల్డ్ కప్ ముగిసే వరకు సమయం ఉన్నా.. తదుపరి కోచ్ ఎవరు అంటూ అప్పుడే చర్చ మొదలైంది. నలుగురు ప్లేయర్లు కోచ్ పదవిపై ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. వాళ్లు ఎవరంటే..?
MS Dhoni AI Generated Pics got Viral: ఎంఎస్ ధోని గ్యాంగ్‌స్టర్‌గా మారితే లుక్ ఎలా ఉంటుందో అని ఊహించుకుంటున్నారా..? కౌబాయ్‌గా ధోని ఎలా కనిపిస్తాడో అని అనుకుంటున్నారా..? మీ ఊహలకు ఇక చెక్ పెట్టండి. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌తో ధోని పిక్స్‌ను డిఫరెంట్స్ లుక్స్‌లో రిలీజ్ చేశారు.
World Cup Qualifier 2023 Matches: ప్రపంచ కప్ క్వాలిఫయర్ మ్యాచ్‌లు రేపటి నుంచి ప్రారంభంకానున్నాయి. మొత్తం 10 జట్లు ప్రపంచకప్‌కు అర్హత సాధించేందుకు పోటీ పడుతున్నాయి. మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు భారత్ వేదికగా జరిగే ప్రపంచకప్‌కు క్వాలిఫై అవుతాయి.
Rohit Sharma & Virat get Rest from West Indies Tour: వెస్టిండీస్ పర్యనటకు సీనియర్ ప్లేయర్లకు సెలెక్టర్లు విశ్రాంతి ఇవ్వనున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు రెస్ట్ ఇవ్వనుండగా.. పుజరాపై వేటు పడే అవకాశం ఉంది. యంగ్ ప్లేయర్లు జట్టులోకి రానున్నారు.
MS Dhoni Emotional Video: ఎంఎస్ ధోని ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పనున్నాడా..? చెన్నై సూపర్ కింగ్స్ ట్వీట్ చేసిన ఓ వీడియోతో మళ్లీ అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. దీంతో తలైవా అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
Suresh Raina In LPL 2023: లంక ప్రీమియర్ లీగ్‌లో సురేష్ రైనా అరంగేట్రం చేయనున్నాడు. ఎల్పీఎల్ 2023 వేలం కోసం తన పేరును నమోదు చేసుకున్నాడు. 50 వేల డాలర్ల బేస్ ప్రైస్‌తో వేలంలోకి రానున్నాడు.
Gautam Gambhir Reacts On Virat Kohli Issue: ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీతో గౌతం గంభీర్‌కు విభేదాలు ఉన్నాయని ఎన్నో రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై గంభీర్ క్లారిటీ ఇచ్చాడు. ఈ ఇద్దరు ఆటగాళ్లతో తాను ఎలా ఉంటాడో చెప్పాడు.
World Cup 2023 Venue List: ఐసీసీ వరల్డ్ కప్‌లో టీమిండియా ఆడే మ్యాచ్‌లకు వేదిక ఖరారు అయ్యాయి. ఈ మేరకు ఐసీసీకి బీసీసీఐ షెడ్యూల్‌ను పంపించింది. అక్టోబర్ 15న పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది.
India vs Australia WTC Final 2023 Highlights: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌గా ఆస్ట్రేలియా నిలిచింది. భారత్‌ను 209 పరుగుల భారీ పరుగుల తేడాతో ఓడించి అసలైన ఛాంపియన్ ఆటతీరును ప్రదర్శించింది. అన్ని రంగాల్లో విఫలమైన భారత్.. వరుసగా రెండోసారి కూడా రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది.
Virat Kohli-Ajinkya Rahane: భారత్ ఆశలన్నీ విరాట్ కోహ్లీ, అజింక్య రహానేలపైనే ఉన్నాయి. ఆదివారం చివరి రోజు కంగారూ బౌలర్లను ఈ ఇద్దరు ఎంత దీటుగా ఎదుర్కొంటే.. టీమిండియా విజయ అవకాశాలు అంత మెరుగవుతాయి. భారత్ విజయానికి మరో 280 రన్స్ కావాల్సి ఉంది. చేతిలో 7 వికెట్లు ఉన్నాయి.
Ind Vs Aus Day 4 Highlights: టీమిండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో రోజు ఆటలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. భారత్ రెండో ఇన్నింగ్స్ సాగుతుండగా.. ఓ అభిమాని తన స్నేహితురాలికి రింగ్ పెట్టి ప్రపోజ్ చేశాడు. యువకుడి ప్రపోజ్‌కు యువతి కూడా ఒకే చెప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
India Vs Pakistan Asia Cup 2023: ఆసియా కప్ 2023ను హైబ్రిడ్ మోడల్లో నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ)కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చేసిన ప్రతిపాదనకు ఆమోదం లభించనుంది. పాకిస్థాన్, శ్రీలంక వేదికగా మ్యాచ్‌లు జరగనున్నాయి. పూర్తి వివరాలు ఇలా..
India Vs Australia WTC Final 2023 Updates: డబ్ల్యూటీసీ ఛాంపియన్‌గా నిలిచేంందుకు టీమిండియాకు మరో 280 పరుగులు కావాలి. చేతిలో 7 వికెట్లు ఉన్నాయి. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, పుజారా ఔట్ అయిపోయారు. ఇక ఆశలన్నీ విరాట్ కోహ్లీ, రహానేపైనే ఉన్నాయి.
Jasprit Bumrah News: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా రీఎంట్రీని దినేశ్ కార్తీక్ కన్ఫార్మ్ చేశాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో కామెంట్రీ చేస్తున్న దినేశ్.. ఐర్లాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌లో బుమ్రాను జట్టులో చూడొచ్చని అన్నాడు. బుమ్రా ఫిట్నెస్ మెరుగైందని చెప్పాడు.
Ind VS Aus WTC Final 2023 day 4 Live Updates: డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఎదురీదుతోంది. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ను 270 వద్ద డిక్లేర్ చేయడంతో భారత్ ముందు 444 పరుగుల టార్గెట్‌ను విధించింది. అనంతరం టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించగా.. 18 పరుగులు చేసి గిల్ ఔట్ అయ్యాడు. అయితే థర్డ్ అంపైర్ ఇచ్చిన తప్పుడు నిర్ణయానికి గిల్ బలయ్యాడని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
Ind Vs Aus WTC Final 2023 Day 1 Updates: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గెలవాలన్న టీమిండియా ఆశలకు ఆసీస్ బ్యాట్స్‌మెన్ అడ్డుకట్ట వేస్తున్నారు. తొలి రోజు మొదట గంట ఆధిపత్యం ప్రదర్శించిన భారత బౌలర్లు ఆ తరువాత పూర్తిగా తేలిపోయారు. కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన తప్పులు కూడా ఆసీస్‌కు కలిసి వచ్చాయి.
Rohit Sharma DRS Viral Video: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మైదానంలో ఎంత సీరియస్‌గా ఉంటాడో.. ఒక్కోసారి అంతే ఫన్నీగా ఉంటాడు. ఆసీస్‌తో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్ టెస్ట్ మ్యాచ్ తొలి రోజు వెరైటీగా డీఆర్ఎస్ కోరి అందరినీ ఆశ్చర్యపరిచాడు. వీడియోను మీరూ చూసేయండి.
India Vs Australia WTC Final 2023 Updates Toss and Playing 11: డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచాడు. స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. పిచ్ పేసర్లకు సహకరించే అవకాశం ఉండడంతో ఒక స్పిన్నర్‌తోనే భారత్ బరిలోకి దిగింది.
India Vs Australia Playing 11 Live Updates and Live Streaming Details: డబ్ల్యూటీసీ ఫైనల్ పోరుకు టీమిండియా, ఆసీస్ జట్లు రెడీ అయ్యాయి. ఐపీఎల్ ఆడి నేరుగా ఇంగ్లాండ్‌కు చేరుకున్న భారత ఆటగాళ్లు.. టెస్ట్ ఫార్మాట్లో ఎలా రాణిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇంగ్లాండ్ పరిస్థితుల దృష్ట్యా కంగారూ జట్టు హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది.
Ind Vs Aud WTC Final 2023: శుభ్‌మన్ గిల్ మరో భామతో రొమాంటిక్ డేట్‌కు వెళ్లాడు. 'స్పైడర్‌మ్యాన్: అక్రాస్ స్పైడర్-వెర్స్' మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా సోషల్ మీడియా ఫేమ్ నిహారిక ఎన్ఎమ్తో ముచ్చటించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.