Puppala guda narsingi double murder case: పుప్పాలగూడ నార్సింగిలో డబుల్ మర్డర్ కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.ఈ క్రమంలో హైదారబాద్ పోలీసులు ముగ్గురు నిందితుల్ని.. మధ్యప్రదేశ్ లో అరెస్ట్ చేశారు. ఏకాంతంగా ఉన్నప్పుడు వీడియో తీసేందుకు ప్రయత్నించగా అంగీకరించలేదని మహిళను, ఇదే విషయంలో హెచ్చరించినందుకు ఆమె ప్రియుడిపై కక్ష గట్టి హతమార్చాడు.
మధ్యప్రదేశ్‌కు చెందిన అంకిత్ సాకేత్ ఉపాధి కోసం హైదరాబాద్ లోని నానక్ రాం గూడకు హౌస్ కీపింగ్ పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో బిందు అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఆమెతో వివాహేతరం సంబంధం ఏర్పడింది. అయితే.. అప్పటికే ఆమెకు పెళ్లై, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆమె భర్త.. విషయం తెలుసుకుని.. వనస్థలిపురంకు మకాం మార్చాడు.
కానీ సాకేత్, బిందులు తరచుగా ఫోన్ లలో మాట్లాడుకునే వారు. దీంతో డబ్బుల్ని సంపాదించాలనే యావలో పడి సాకేత్ కలిసి వ్యభిచారం ప్రారంభించింది. సాకేత్ ... ఆమె దగ్గరకు విటుళ్లను పంపేవాడు. దీంతో సాకేత్ స్నేహితులైను.. రాహుల్, రాజ్, సుఖేంద్రల దగ్గరకు బిందువిషయం చెప్పాడు. ఈ క్రమంలో. జన్వరి 8న బిందు.. సాకేత్ ఇంటికి వెళ్లింది.
రెండుసార్లు బిందుతో ఏకాంతంగా గడిపిన రాహుల్ కుమార్.. సెల్ఫోన్లో ఆమెతో రొమాన్స్ చేయడం రికార్డుకు ప్రయత్నించాడు. కానీ ఆమె తిరస్కరించింది. అంతటితో ఆగకుండా.. హెచ్చరిచ్చింది. దీంతో కోపంపెంచుకున్న.. రాహుల్.. బిందు, అంకిత్ లను హతమార్చాలని నిర్ణయించుకుని రాజ్, సుఖేంద్రల సాయం తీసుకున్నాడు. ప్లాన్ ప్రకారం.. వారిని..ఈ నెల 11న అంకిత్ ద్వారా బిందును మరోసారి పిలిపించుకున్నాడు. అదేరోజు రాహుల్, రాజ్, సుఖేంద్రలు సాకేత్, బిందులను ఆటోలో పుప్పాలగూడ అనంత పద్మస్వామి గుట్టల్లోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు.
Read more: Viral Video: బాబోయ్.. కల్లు సీసాలో కట్లపాము కలకలం.. షాకింగ్ వీడియో వైరల్..
అందరూ మద్యం తాగుతుండగా సుఖేంద్ర.. బిందుతో రొమాన్స్ కు దిగాడు. అప్పుడు.. అంకిత్ ఒంటరిగా ఉండడంతో అదే అదనుగా భావించిన రాహుల్, రాజ్ కుమార్‌లు కత్తితో పొడిచి బండరాయితో కొట్టి చంపారు. ఆ తర్వాత బిందును క్రూరంగా హతమార్చాడు. అనంతరం నిందితులు ముగ్గురు కూడా.. 12న మధ్యప్రదేశ్ కు పారిపోయారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా నిందుతుల్ని హైదరబాద్ పోలీసులు మధ్య ప్రదేశ్ లో అరెస్ట్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter