Pakistan vs Bangladesh: అంతర్జాతీయ క్రికెట్ మండలి నిర్వహించిన ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ పరువు పోగొట్టుకుంది. ప్రతిష్టాత్మక క్రికెట్ వేడుకకు ఆతిథ్యం ఇస్తున్నామనే సంతోషం పాకిస్థాన్ ప్రజలకు కొన్ని రోజులు కూడా మిగలలేదు. మిగలకపోగా చేదు అనుభవం ఎదురైంది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆతిథ్య జట్టు ఒక్క మ్యాచ్‌లో కూడా విజయం సాధించకుండా వీడ్కోలు పలికింది. రెండు మ్యాచ్‌ల్లో ఘోర పరాభవం అనంతరం పరువు కోసం పోరాటం చేద్దామనుకుంటే పాకిస్థాన్ జట్టుకు పరిస్థితులు అనుకూలంగా లేవు. వరుణుడి రూపంలో దురదృష్టం వెంట రావడంతో ఒక్క పరుగు చేయకుండానే తన ఆఖరి లీగ్ మ్యాచ్ రద్దవడంతో పాకిస్థాన్‌కు ఊహించని పరాభవం ఎదురైంది. ఐసీసీ ఈవెంట్ నిర్వహిస్తున్నామనే ఆనందం ఏమాత్రం లేకుండాపోవడం పాకిస్థాన్ క్రికెట్ప్రియులను తీవ్రంగా కలచివేస్తోంది.
Also Read: Ind vs Pak Highlights: కసి తీర్చుకున్న భారత్.. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి పాక్ ఔట్?
రావల్పిండిలో గురువారం పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య కీలక మ్యాచ్ జరగాల్సిఉంది. చివరి లీగ్ మ్యాచ్‌లో తాడోపేడో తేల్చుకుందామని చూడగా వర్షం రూపంలో ఆటంకం ఎదురైంది. ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుండడంతో మ్యాచ్ నిర్వహణపై సందిగ్ధం ఏర్పడింది. చివరకు వర్షం తెరపినివ్వకపోవడంతో నిర్వాహకులు మ్యాచ్‌ను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. వర్షం కారణంగా టాస్ పడకుండానే మ్యాచ్ రద్దవడం గమనార్హం.
Also Read: Ambati Rayudu Comments: ఏంటి రాయుడూ..పుసుక్కున అంత మాటనేశావ్, మండిపడుతున్న చిరు అభిమానులు
మైదానం చిత్తడిగా మారడం.. ఔట్‌ఫీల్డ్ మొత్తం నీటితో నిండడతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. అనంతరం ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. ఈ మ్యాచ్ రద్దుతో పాకిస్థాన్ ఒక్క విజయం కూడా సొంతం చేసుకోకపోగా.. బంగ్లాదేశ్ కూడా పాక్ మాదిరి ఒక్కటీ విజయం సాధించలేదు. ఈ రెండు పొరుగు దేశాల జట్లకు ఛాంపియన్స్ ట్రోఫీ తీవ్ర నిరాశను మిగిల్చింది. ఇరు జట్లు భారత్ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. మంగళవారం రావల్పిండిలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మ్యాచ్ కూడా రద్దయిన విషయం తెలిసిందే. ఈనెల 2వ తేదీన ఆదివారం దుబాయ్‌లో భారత్, న్యూజిల్యాండ్ జట్లు తలపడనున్నాయి. ఆసక్తికర విషయం ఏమిటంటే గ్రూపు ఏలో ఉన్న ఈ రెండు జట్లు ఇప్పటికే సెమీ ఫైనల్‌కు చేరాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి