Orange Cap Winners List In IPL: ఐపీఎల్ 16వ సీజన్ మార్చి 31న ప్రారంభంకానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య తొలిపోరు అహ్మదాబాద్‌లో జరగనుంది. కాసుల వర్షం కురిపించే ఈ లీగ్‌లో ప్రతి ఆటగాడు సత్తా నిరూపించుకునేందుకు తహతహలాడుతుంటాడు. ముఖ్యంగా బ్యాట్స్‌మెన్ పరుగుల వరద పారించి టాప్ స్కోరర్‌గా నిలవాలని అనుకుంటారు. లీగ్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌కు ఆరెంజ్ క్యాప్ దక్కుతుంది. ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్న ప్లేయర్‌కు రూ.15 లక్షలు ప్రైజ్‌మనీ ఇస్తారు. ఇప్పటివరకు డేవిడ్ వార్నర్ అత్యధికంగా మూడుసార్లు ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు.
2008 తొలి సీజన్లో పంజాబ్ కింగ్స్ ఆటగాడు షాన్ మార్ష్ సంచలన ఆటతీరుతో అందరినీ అబ్బుపరిచాడు. వరుస హాఫ్ సెంచరీలతో చెలరేగాడు. దీంతో తొలిసారి ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్న ఆటగాడిగా నిలిచాడు. 2010లో ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా సచిన్ టెండూల్కర్ నిలిచాడు. గతేడాది సీజన్లో ఆరెంజ్ క్యాప్ ఇంగ్లండ్ డాషింగ్ బ్యాట్స్‌మెన్ జోస్ బట్లర్‌కు దక్కింది. ఈసారి ఏ ఆటగాడు ఈ క్యాప్‌ను దక్కించుకుంటాడో చూడాలి. గత 15 సీజన్లలో ఆరెంజ్ క్యాప్ విజేతలు వీళ్లే..
==> 2008 ఆరంభ సీజన్లో ఆస్ట్రేలియాకు చెందిన షాన్ మార్ష్ ఆరెంజ్ క్యాప్ అందుకున్న తొలి ఆటగాడిగా నిలిచాడు. 616 రన్స్ చేశాడు.
==> ఆ తరువాత ఏడాది కూడా ఆసీస్ ప్లేయర్‌కే ఆరెంజ్ క్యాప్ దక్కింది. మ్యాథ్యూ హేడెన్ అత్యధిక పరుగులు (572) చేసిన ఆటగాడిగా నిలిచాడు.
==> 2010 సీజన్లో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ పొట్టి ఫార్మాట్లో దుమ్ములేపాడు. ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న మొదటి భారతీయ ఆటగాడిగా నిలిచాడు. 618 పరుగులు చేశాడు సచిన్.
==> 2011, 2012 సీజన్లలో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ (608, 733) పరుగుల వరద పారించాడు. వరుసగా రెండుసార్లు ఆరెంజ్ క్యాప్ పొందాడు.
==> 2013లో ఆసీస్ స్టార్ ప్లేయర్ మైఖేల్ హస్సీ (733 రన్స్)ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు.
==> 2014లో కోల్కత్తా నైట్ రైడర్స్ తరుఫున రాబిన్ ఉతప్ప (660 పరుగులు) చెలరేగి ఆడాడు. దీంతో ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు.
==> ఈ లీగ్‌లో డేవిడ్ వార్నర్ మూడుసార్లు అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 2015, 2017, 2019 సీజన్లలో టాప్ స్కోరర్‌గా నిలిచి ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా నిలిచాడు. ఆ మూడు సీజన్లలో వరుసగా 562, 641, 692 రన్స్ చేశాడు.
==> 2016 సీజన్లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఆటతీరుతో అబ్బుపరిచాడు. 973 పరుగులు చేసి.. లీగ్ చరిత్రలో ఒక సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేశాడు. ఈ సీజన్లో ఏకంగా నాలుగు సెంచరీలు చేశాడు. ఈ రికార్డు బద్దలవ్వడం ఇప్పట్లో అసాధ్యంగా కనిపిస్తోంది.
==> 2018లో సన్‌రైజర్స్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ 735 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు.
==> 2020 సీజన్లో పంజాబ్ కింగ్స్ తరుఫున కేఎల్ రాహుల్ చెలరేగి ఆడాడు. 670 రన్స్ చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
==> 2021లో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ సంచలన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. 635 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు.
==> గతేడాద సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరుఫున జోస్ బట్లర్ విధ్వంసం సృష్టించాడు. బౌలర్లను ఊచకోత కోస్తూ నాలుగు సెంచరీలు చేశాడు. 863 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా నిలిచాడు.
Also Read: Pension Plan: ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయండి.. ప్రతి నెలా పెన్షన్ పొందండి
Also Read: IPL 2023 Updates: టైటిల్ వేటకు లక్నో సూపర్ జెయింట్స్ రెడీ.. ఆశలన్నీ వారిపైనే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి