Sandeep Reddy Vanga: ఎంక్వైరీలో అలా తేలింది..అందుకే సాయి పల్లవిని రిజెక్ట్ చేశా

Sandeep Reddy Vanga: చైతూ, సాయి పల్లవి నటించిన తండేల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు సందీర్ రెడ్డి వంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. సాయి పల్లవిని తాను రిజెక్ట్ చేశానన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 3, 2025, 06:33 AM IST
Sandeep Reddy Vanga: ఎంక్వైరీలో అలా తేలింది..అందుకే సాయి పల్లవిని రిజెక్ట్ చేశా

Sandeep Reddy Vanga: తండేల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటి సాయి పల్లవిపై సందీప్ రెడ్డి ఆసక్తికర, సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె గురించి ఎంక్వైరీ చేసిన తరువాత వద్దనుకున్నానన్నారు. కారణం ఆమె కేరక్టర్ అని చెప్పుకొచ్చారు. 

ఫిబ్రవరి 7న ధియేటర్ రిలీజ్ కానున్న నాగ చైతన్య, సాయి పల్లవి సినిమా తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప్రత్యేక అతిధిగా వచ్చిన ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన అర్జున్ రెడ్డి సినిమాలో సాయి పల్లవిని హీరోయిన్‌గా తీసుకోవాలని అనుకున్నానన్నారు. ఆమె గురించి పూర్తిగా ఎంక్వైరీ చేసిన తరువాత ఆమెను రిజెక్ట్ చేశానన్నారు. దానికి కారణం ఆమె ఆహార్యం, కేరక్టర్ అని చెప్పారు. సాయి పల్లవి గురించి మలయాళంలో ఓ కో ఆర్డినేటర్‌ను అడిగి సినిమా రొమాంటిక్ అని చెప్పానన్నాడు. దాంతో అతను ఆ అమ్మాయి గురించి మర్చిపోండి, ఆమె కనీసం స్లీవ్‌లెస్ డ్రెస్ కూడా వేసుకోదని చెప్పడంతో సాయి పల్లవిపై ఆశలు వదిలేసుకున్నానన్నారు. 

సాధారణంగా సినీ పరిశ్రమలో హీరోయిన్లు ప్రారంభంలో తీసుకున్న నిర్ణయాలను తరువాత మార్చుకుంటారని కానీ సాయి పల్లవి అందుకు విరుద్ధమన్నారు. పద్ధతైన పాత్రలు మాత్రమే చేయాలని మొదట్లో తీసుకున్న నిర్ణయానికి ఇప్పటికీ కట్టుబడి ఉందన్నారు. ఇది సామాన్య విషయం కాదని ఆమెను ప్రశంసించారు. 

ఇక చైతూ అంటే తను చాలా ఇష్టమన్నారు. కారణం తెలియదు గానీ కేడీ సినిమా నుంచి చైతూ అంటే ప్రత్యేక ఇష్టం ఏర్పడిందన్నారు. కొందరితో పరిచయం లేకపోయినా ఎందుకో మంచి అభిప్రాయం ఏర్పడి ఇష్టంగా మారుతుందని వ్యాఖ్యానించారు. అలాంటి వ్యక్తే నాగచైతన్య అన్నారు. కబీర్ సింగ్ లేదా యానిమల్ సినిమాలో చైతూ బట్టల్నే రిఫరెన్స్‌గా తీసుకున్నానన్నారు. 

Also read: VIVO X200 Pro Mini: కళ్లు చెదిరే పవర్‌ఫుల్ ఫీచర్లతో VIVO X200 Pro Mini లాంచ్ ఎప్పుడు, ధర ఎంత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News