Ratha Saptami: 102 ఏళ్ల తర్వాత రథ సప్తమి వేళ అద్భుతం.. ఈ రాశుల వారికి డబుల్ జాక్ పాట్.. మీరున్నారా..?

Ratha saptami zodiac signs: రథ సప్తమి వేడుకల్ని భక్తులు ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఈ రోజున కొన్ని అద్భుత యోగాలు ఏర్పడుతున్నాయి. దీని ప్రభావం ద్వాదశ రాశులపై కూడా ఉంటుంది.

1 /6

రథసప్తమిని ఎంతో పవిత్రమైందని చెప్తుంటారు. ఈరోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలంటు స్నానం చేయాలి. అంతే కాకుండా.. జిల్లెడు ఆకుల్ని తల మీద పెట్టుకుని మరీ స్నానం చేయాలి. ఇలా చేస్తే జాతకంలోని దోషాలన్ని పోతాయి.

2 /6

అయితే.. దాదాపు.. 102 ఏళ్ల తర్వాత రథసప్తమి వేళ గొప్ప  యోగం ఏర్పడుతుంది. సూర్యుడు, శని, గురుడు ఒకే సరళ రేఖ మీద మీనం, కన్యరాశిలో ఏర్పడుతున్నారు. దీని ప్రభావం వల్ల కొన్ని రాశులకు అనుకొని విధంగా ధనలాభం కల్గడంతో పాటు.. జీవితంలో లగ్జరీ లైఫ్ ను గడుపుతారని పండితులు చెబుతున్నారు.

3 /6

రథ సప్తమిరోజున సూర్యుడ్ని ప్రత్యేంగా ఆరాధన చేయాలి. అదే విధంగా ఈరోజున సూర్యనారాయణ స్తోత్రాలను పారాయణ చేయాలి. అష్టోత్తర పారాయణం చేస్తే జాతక దోషాలన్ని దూరమౌతాయి.

4 /6

సింహరాశివారికి ఈ యోగం వల్ల అన్ని శుభాలు కల్గుతాయి. జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. రాదనుకున్న డబ్బులు చేతికి అందుతాయి. జాబ్ లో ప్రమోషన్ రావడానికి ఆస్కారం ఉంది.  

5 /6

కన్య రాశి వీరికి బంధువుల నుంచి రాజకీయ నేతల నుంచి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కోర్టు కేసుల్లో విజయాలు సాధిస్తారు. సోదరులతో ఏర్పడిన గొడవలు సమసిపోతాయి. అనుకొని విధంగా లాటరీలు తగిలే చాన్స్‌ లు ఉన్నాయని చెప్పుకొవచ్చు.

6 /6

మకరం రాశి వారు రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తారు. సూర్యుడ్ని ఆరాధించడం వల్ల శరీరంలోని రోగాలన్ని దూరమౌతాయి. నూతనంగా వాహానాలు, ఇళ్లను కొనుగొలు చేస్తారు.( ఇది సోషల్ మీడియా కంటెంట్ ఆధారంగా రాయడం జరిగింది.. జీ మీడియా దీన్ని ధృవీకరించలేదు..)