Latest Self Employment Business Idea: ఆదాయం ఎక్కువ.. పెట్టుబడి తక్కువ ఉండే బెస్ట్‌ బిజినెస్‌ ఐడియా.. నెలకు రూ. 50,000 లాభం

Fancy Store Small Business Idea: ప్రస్తుతం చాలా మంది చిన్న వ్యాపారాల వైపు మొగ్గు చూపుతున్నారు. చిన్న వ్యాపారానికి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టనవసరం లేదు. మీ దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బుతోనే ప్రారంభించవచ్చు. మీ వ్యాపారానికి మీరే యజమాని కాబట్టి మీ నిర్ణయాలు మీరే తీసుకోవచ్చు. చిన్న వ్యాపారం ప్రారంభించడం కష్టమైన పని కానీ అది చాలా లాభదాయకమైనది కూడా. మీరు కష్టపడి పనిచేస్తే చిన్న వ్యాపారం పెద్దగా అభివృద్ధి చెందగలదు. అయితే మీరు కూడా ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నారా? ముఖ్యంగా ఇంట్లో ఉండే మహిళలకు ఇది ఒక అద్భుతమైన బిజినెస్‌. ఎలా ప్రారంభించాలి? ఎంత పెట్టుబడి అవుతుంది? అనే విషయాలు తెలుసుకుందాం. 

1 /10

నేటి కాలంలో చాలా మంది సొంత వ్యాపారాలను ప్రారంభించడానికి ఆసక్తి చూపుతున్నారు. దీనికి కారణం ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. ఇంటి నుంచి కూడా బిజినెస్‌ చేయవచ్చని ఈ వ్యాపారం ప్రారంభిస్తున్నారు. అయితే  మీరు కూడా వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకుంటే మీరు తెలుసుకొనే ఈ బిజినెస్‌ ఎంతో లాభదాయకం. 

2 /10

ఈరోజు మీరు తెలుసుకొనే వ్యాపారం మహిళలకు ఎంతో ఉపయోగపడే బిజినెస్‌. ఈ బిజినెస్‌ను ఇంటి నుంచి కూడా ప్రారంభించవచ్చు. మీరు ఎక్కువ పెట్టుబడి పెట్టుకోవాల్సిన అవసరం లేదు.

3 /10

ఫ్యాన్సీ స్టోర్ అనేది తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందగలిగే వ్యాపారం. దీనికి మార్కెట్‌లో ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఫ్యాన్సీ స్టోర్ వ్యాపారం ఎలా ప్రారంభించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

4 /10

ఫ్యాన్సీ స్టోర్ వ్యాపారం ప్రారంభించడానికి ముందుగా మీ దగ్గరలో ఉన్న మార్కెట్‌ను సర్వే చేయాల్సి ఉంటుంది. ఏ రకమైన ఫ్యాన్సీ వస్తువులకు డిమాండ్ ఎక్కువగా ఉందో తెలుసుకోవాలి.

5 /10

ఆ తర్వాత మీ బడ్జెట్‌ను నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. మీ బడ్జెట్‌కు అనుగుణంగా ఫ్యాన్సీ వస్తువులను ఎంచుకోవాలి. ఫ్యాన్సీ స్టోర్ కోసం స్థలం ఎంచుకోవడం చాలా ముఖ్యం. మీ స్టోర్ ప్రజలకు సులభంగా కనిపించేలా ఉండాలి.

6 /10

ఫ్యాన్సీ వస్తువులను కొనుగోలు చేయడానికి హోల్‌సేల్ దుకాణాలను సందర్శించండి. అక్కడ మీకు తక్కువ ధరలకు వస్తువులు లభిస్తాయి. ఫ్యాన్సీ స్టోర్‌లో వివిధ రకాల వస్తువులను అందుబాటులో ఉంచండి. కస్టమర్‌లను ఆకర్షించడానికి మీ దుకాణాన్ని అందంగా అలంకరించండి.

7 /10

ఫ్యాన్సీ స్టోర్‌ను ప్రోత్సహించడానికి మీరు సోషల్ మీడియాను ఉపయోగించవచ్చు. ఫ్యాన్సీ స్టోర్ వ్యాపారంలో విజయం సాధించడానికి కస్టమర్‌లతో మంచి సంబంధాలను ఏర్పరచుకోండి. వారికి నాణ్యమైన సేవను అందించండి.  

8 /10

ఈ బిజినెస్‌ను చిన్నగా ప్రారంభించడానికి మీకు రూ. 10 వేలు అవుతుంది. మీరు కొత్తగా, పెద్దగా ప్రారంభించాలని ఆలోచిస్తే కనీసం రూ. 5 లక్షలు పెట్టుబడి అవుతుంది.

9 /10

మీ దగ్గర పెట్టుబడికి కావాల్సిన డబ్బు లేకపోతే ప్రధాన మంత్రి ముద్ర యోజన కింద లోన్‌ తీసుకోవచ్చు. ఈ పథకం చిన్న వ్యాపారాలకు ఎంతగానో సహాయపడుతుంది. 

10 /10

ఈ వ్యాపారంతో మీరు నెలకు రూ. 8,000 నుంచి రూ. 15,000 సంపాదించవచ్చు. సంవత్సరానికి రూ. 5 లక్ష నుంచి రూ. 20 లక్షలు సంపాదించవచ్చు. కాబట్టి మీకు ఈ ఐడియా నచ్చితే మీరు కూడా ఈ బిజినెస్ ట్రై చేయండి.