IND vs AUS: ఆకాశమే హద్దుగా చెలరేగిన గ్రీన్, వేడ్‌.. తొలి టీ20లో టీమిండియా ఓటమి!

Australia beat India in first T20I match. మొహాలి వేదికగా మంగళవారం టీమిండియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆసీస్ నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది.   

Written by - P Sampath Kumar | Last Updated : Sep 21, 2022, 08:57 AM IST
  • ఆకాశమే హద్దుగా చెలరేగిన గ్రీన్, వేడ్‌
  • తొలి టీ20లో టీమిండియా ఓటమి
  • పాండ్యా మెరుపులు వృథా
IND vs AUS: ఆకాశమే హద్దుగా చెలరేగిన గ్రీన్, వేడ్‌.. తొలి టీ20లో టీమిండియా ఓటమి!

Australia beat India in first T20I match: భారత్‌పై మూడు మ్యాచుల టీ20 సిరీస్‌లో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. మొహాలి వేదికగా మంగళవారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఆసీస్ నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. భారత్ నిర్ధేశించిన 209 పరుగుల భారీ లక్ష్యాన్ని  6 వికెట్లు కోల్పోయి ఇంకో 4 బంతులుండగానే ఛేదించింది. కామెరూన్‌ గ్రీన్‌ (61; 30 బంతుల్లో 8×4, 4×6), మాథ్యూ వేడ్‌ (45 నాటౌట్‌; 21 బంతుల్లో 6×4, 2×6) చెలరేగగా.. స్టీవ్‌ స్మిత్‌ (35; 24 బంతుల్లో 3×4, 1×6) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అక్షర్‌ (3/17) కెరీర్‌ ఉత్తమ బౌలింగ్‌ ప్రదర్శన చేశాడు. ఇరు జట్ల మధ్య రెండో మ్యాచ్ శుక్రవారం నాగపూర్‌లో జరుగుతుంది.

ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్‌ 6 వికెట్లకు 208 పరుగుల భారీ స్కోరు సాధించింది. రోహిత్‌ శర్మ (11), విరాట్ కోహ్లీ (2)లు త్వరగానే పెవిలియన్ చేరారు. కేఎల్‌ రాహుల్‌ (55; 35 బంతుల్లో 4×4, 3×6), సూర్యకుమార్‌ యాదవ్ (46; 25 బంతుల్లో 2×4, 4×6) కీలక భాగస్వామ్యంతో భారత్ కోలుకుంది. అనంతరం హార్దిక్‌ పాండ్యా (71 నాటౌట్‌; 30 బంతుల్లో 7×4, 5×6), విధ్వంసకర బ్యాటింగ్‌తో భారత్‌ భారీ స్కోరు సాధించగలిగింది. హార్దిక్‌ 25 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ బాదాడు. చివరి 7 ఓవర్లలో భారత్‌ 89 పరుగులు చేస్తే.. ఇందులో హార్దిక్‌ 69 పరుగులు చేయడం విశేషం. 

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు మంచి ఆరంభం దక్కింది. భువనేశ్వర్‌ కుమార్, ఉమేశ్‌ యాదవ్‌ బౌలింగ్లో ఆరోన్‌ ఫించ్‌ (13 బంతుల్లో 22; 3 ఫోర్లు, 1 సిక్స్‌) చెలరేగాడు. ఫించ్‌ను అవుట్‌ చేసి అక్షర్‌ పటేల్.. టీమిండియాకు బ్రేక్ ఇచ్చాడు. గ్రీన్, స్మిత్‌ భాగస్వామ్యం (40 బంతుల్లో 70 పరుగులు)తో ఆసీస్‌ కోలుకుంది. అక్షర్, కేఎల్ రాహుల్‌ చెరో క్యాచ్‌ వదిలేయడం రోహిత్ సేనను దెబ్బతీసింది. చెలరేగిన గ్రీన్ 26 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 10 ఓవర్లలో ఆసీస్ స్కోరు 109 పరుగులకు చేరింది.

ఆసీస్ 60 బంతుల్లో 109 పరుగులు చేయాల్సి ఉండగా.. గ్రీన్‌ను అక్షర్‌ అవుట్‌ చేశాడు. ఉమేశ్‌ ఒకే ఓవర్లో స్మిత్, మ్యాక్స్‌వెల్‌ (1)లను వెనక్కి పంపడంతో ఆసీస్ రేసులో వెనకపడిపోయింది. ఇన్‌గ్లిస్‌ (17) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. ఇక భారత్ విజయం ఖాయం అనుకున్నారు అందరూ. ఈ దశలో వేడ్‌ మెరుపు బ్యాటింగ్‌ మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. భువీ, హర్షల్‌ బౌలింగ్లో బౌండరీలు బాదుతూ పరుగులు చేశాడు. దాంతో ఆసీస్‌ గెలుపు ఖాయమైంది. ఆఖరి ఓవర్లో 2 పరుగులే అవసరం కాగా.. తొలి బంతికి డేవిడ్‌ (18) ఔట్ అయ్యాడు. రెండో బంతికి కమిన్స్‌ ఫోర్‌ కొట్టి మ్యాచ్‌ను ముగించాడు.

Also Read: Dasara Holidays in Telangana: తెలంగాణలో దసరా సెలవులు తగ్గించనున్నారా ? ఫుల్ డీటేల్స్ ఇదిగో
Also Read: 7th Pay Commission: డీఏ పెంపు తేదీ ఖరారు, సెప్టెంబర్ 28న మూడు నెలల ఎరియర్స్‌తో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News