Shikhar Dhawan: శిఖర్ ధావన్​ను​ ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసుకోవట్లేదా?

IPL 2022: ఐపీఎల్​ 15వ సీజన్​లో శిఖర్​ ధావన్ ఢిల్లీ క్యాపిటల్స్​ తరఫున ఆడే అవకాశాలు కనిపించడం లేదు. మెగా వేలానికి ముందు శిఖర్​ ధావన్​ను ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్​ చేసుకోకపోవచ్చని సమాచారం.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 25, 2021, 12:58 PM IST
  • ఢిల్లీ క్యాపిటల్స్​కు శిఖర్ ధావన్ దూరమయ్యే అవకాశం
  • రిటైన్​ జాబితాలో ధావ్​కు చోటు దక్కక పోవచ్చని వార్తలు
  • కొత్త టీమ్స్​లో ధావన్​కు కెప్టెన్సీ అవకాశాలు!
Shikhar Dhawan: శిఖర్ ధావన్​ను​ ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసుకోవట్లేదా?

Delhi Capitals May not Retaine Shikhar Dhawan for IPL 2022: వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్​ 15వ సీజన్​ మరింత ఆసక్తికరంగా మారనుంది. వచ్చే ఏడాది రెండు కొత్త టీమ్స్​ ఐపీఎల్​లో (New teams to IPL 2022) భాస్వామ్యం కానున్నాయి.

అయితే అంతకు ముందు ఐపీఎల్​ 2022కు సంబంధించి మెగా వేలం (IPL 15 mega Auction) జరగనుంది. దీనితో వచ్చే ఏడాది ఐపీఎల్​లో ప్రతి టీమ్​​లో భారీ మార్పులు చోటు చేసుకోనన్నాయి. ఈ ఏడాది డిసెంబర్​లోనే ఈ మెగా వేలం నిర్వహిచనుంది బీసీసీఐ. ఈ నేపథ్యంలో ఐపీఎల్ జట్లన్నిటికి నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసేందుకు అవకాశం కల్పించింది.

రిటైన్​ అవకాశాలు ఇలా..

మెగా వేలానికి ముందు ప్రతి టీమ్​లో ప్రస్తుతం ఆడుతున్న నలుగురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్​చేసుకునేందుకు వీలుంది. మిగతా ప్లేయర్స్ అందరిని వేలంలో కొనాల్సిందే. అందులో ఓ విదేశీ ఆటగాడు ఉండాలనేది నిబందన.

ఈ నేపథ్యంలో టీమ్స్ అన్ని ప్లేయర్స్​ను రైటన్ చేసుకోవాల్సిన నలుగురు ప్లేయర్స్​ జాబితాను రెడీ చేసే పనిలో పడ్డాయి.

Also read: IND vs NZ 1st Test: టీమిండియాదే బ్యాటింగ్.. అయ్యర్ అరంగేట్రం! తెలుగు ఆటగాడికి దక్కని చోటు!!

Also read: IPL 2022 auction: ధోనీ మరో మూడేళ్లపాటు CSK కే సొంతం ?

ధావన్​ను వదులుకోనున్న ఢిల్లీ క్యాపిటల్స్​?

శిఖర్​ ధావన్​ను రిటైన్​​ చేసుకునేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi capitals) జట్టు యాజమాన్యం సిద్ధంగా లేదని తెలుస్తోంది. టీమ్​లో రిషబ్​ పంత్​, పృథ్వి షా, అక్షర్ పటెల్​లతో పాటు ఫారిన్ ప్లేయర్ కగిసో రబాడాలను రిటైన్​​ చేసుకోవాలని ఢిల్లీ క్యాపిటల్స్ భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఇప్పటికే జాబితా రెడీ అయినట్లు తెలుస్తోంది. అయితే గత రెండు సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అత్యధిక స్కోరర్​ శిఖర్ ధావన్ (Shikhar Dhawan) కావడం విశేషం. 

ధావన్​తో పాటు.. ఆ జట్టులో స్టార్​ ప్లేయర్స్​ అశ్విన్​, శ్రేయస్​ అయ్యర్​ వంటి వాళ్లను కూడా వదులుకునేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ సిద్దమైనట్లు తెలుస్తోంది.

రిటైన్ ప్లేయర్ల్ జాబితాను సమర్పించేందుకు ఐపీఎల్ ఫ్రాంఛైంజీలకు ఈ నెల 30 వరకే అవకాశముంది.

కెప్టెన్​గా ధావన్​..

అయితే శిఖర్ ధావన్​ను ఢిల్లీ రిటైన్​ చేసుకోకుంటే.. పలు ఫ్రాంచైజీలు అతడి మెగా వేలంలో తీసుకునేందుకు పోటీ పడొచ్చని తెలుస్తోంది. ముఖ్యంగా అతడికి జట్టు సారథ్య బాధ్యతలు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ విషయాలన్నింటిపై పూర్తి క్లారిటీ రావాలంటే.. మెగా వేలం పూర్తయ్యే వరకు ఆగాల్సిందే.

Also read: Rahul Dravid Bowling Video: నెట్స్​లో చెమటోడ్చిన ద్రవిడ్.. బౌలింగ్ మాములుగా లేదుగా (వీడియో)!!

Also read: IND Vs NZ: ఆ యువ ఆటగాడు ఉన్నాడు.. రాహుల్‌ లేని ప్రభావం జట్టుపై ఉండదు: రహానే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News