Tirumala Darshan Tickets: ప్రస్తుతం తిరుమలలో రద్దీ సాధారణంగానే ఉంది. కానీ రోజురోజుకూ పెరుగుతోంది. వేసవి సెలవుల్లో భక్తులు పోటెత్తుతుంటారు. మీరు కూడా మే నెల వేసవి సెలవుల్లో స్వామి దర్శనం కోసం వెళ్లే ఆలోచన చేస్తుంటే మీ కోసమే ఈ అప్ డేట్. టీటీడీ మే నెల కోటా టికెట్లను ఇవాళ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తోంది.
వేసవి సెలవుల్లో స్వామి దర్శనం ఏర్పాట్లు ఇవాళే చేసుకోవాల్సి ఉంటుంది. మే నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ ఇవాళ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్ ద్వారా విడుదల చేస్తోంది. సుప్రభాతం, తోమాల సేవ, అష్టదళ పాదపద్మారాధన సేవల టికెట్ల కోసం ఈ నెల 20 ఉదయం 10 గంటల నుంచి ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకుని చెల్లింపులు మాత్రం 22 వరకూ చేయవచ్చు. ఆ తరువాతే లక్కీ డిప్ ద్వారా టికెట్లు మంజూరు అవుతాయి. ఇక తిరుమల ఆర్జిత బ్రహ్మోత్సవం, శ్రీవారి కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపకాలంకార సేవ టికెట్లు ఈ నెల 21 ఉదయం 10 గంటలకు విడుదల కానున్నాయి.
అదే రోజు అంటే ఫిబ్రవరి 21 మద్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, దర్శన స్లాట్స్ కోటా విడుదల కానుంది. ఫిబ్రవరి 22 ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణం టోకెన్లు ఆన్‌లైన్‌లో విడుదల కానున్నాయి. ఫిబ్రవరి 22 ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు టికెట్లు విడుదలవుతున్నాయి. ఫిబ్రవరి 24 మద్యాహ్నం 3 గంటలకు వసతి గదుల కోటా విడుదల చేస్తారు. 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు కూడా అదే రోజు ఉదయం 10 గంటలకు విడుదలవుతాయి.
మే నెల వివిధ సేవల టికెట్ల కోసం టిటీడీ అధికారిక వెబ్‌సైట్ https://ttddevasthanams.ap.gov.in ద్వారా తీసుకోవచ్చు. ఆదివారం స్వామివారిని 79 వేల మంది దర్శించుకోగా 24 వేల మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం 3.67 కోట్లు ఉంది.
తిరుమల మే నెల కోటా ముఖ్యమైన తేదీలు
ఫిబ్రవరి 20 ఉదయం 10 గంటలకు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు
ఫిబ్రవరి 20 ఉదయం 10 గంటల నుంచి సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవ టికెట్ల బుకింగ్
ఫిబ్రవరి 20-22 వరకు చెల్లింపులు, లక్కీ డిప్
ఫిబ్రవరి 21 ఉదయం 10 గంటలకు ఆర్జిత బ్రహ్మోత్సవం, శ్రీవారి కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపకాలంకార సేవ టికెట్లు
ఫిబ్రవరి 21 మద్యాహ్నం 3 గంటలకు వర్సువల్ సేవలు, దర్శనం స్లాట్స్ బుకింగ్
ఫిబ్రవరి 22 ఉదయం 10 గంటలు అంగ ప్రదక్షిణం టోకెన్లు
ఫిబ్రవరి 22ఉదయం శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు
ఫిబ్రవరి 24 మద్యాహ్నం 3 గంటలకు వసతి గదుల బుకింగ్
ఫిబ్రవరి 24 ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు
Also read: VIVO V50: అత్యంత స్లిమ్ ఫోన్ వచ్చేసింది, కెమేరా అయితే సినిమాలే తీయవచ్చు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి