Mercury Transit - Rasi Phalalu: బుధ గ్రహాన్ని అన్ని గ్రహాలకు రాకుమారుడు.. గ్రహ పాలకుడిగా భావిస్తారు. ప్రస్తుతం ఈ గ్రహం బృహస్పతి పాలించే ధనస్సు రాశిలో సంచార దశలో ఉన్నాడు. ఈ సంచారం జనవరి 4వ తేదీన ఉదయం పూట జరిగింది. బుధ గ్రహం అన్ని గ్రహాల్లా కాకుండా ఏ రాశిలోనైనా దాదాపు 21 రోజులపాటు సంచారం దశలో కొనసాగుతూ ఉంటాడు. ఇదిలా ఉంటే ఈ గ్రహం ధనస్సు రాశిలో అస్తమించబోతున్నాడు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. జనవరి 18వ తేదీ శనివారం బృహస్పతి గ్రహం గా పిలువబడే ధనస్సు రాశిలో అస్తమించబోతున్నాడు. అయితే బృహస్పతి బుధ గ్రహం రెండు గ్రహాల మధ్య శత్రు ప్రభావాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి ఈ గ్రహం అస్తమించడం వల్ల కొన్ని రాశుల వారిపై సానుకూల ప్రతికూల ప్రభావం పడుతుంది.
వృషభ రాశి
ముఖ్యంగా ఈ గ్రహం అస్తమించడం వల్ల వృషభ రాశి వారిపై ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది. దీనివల్ల ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితులపై ప్రత్యేకమైన ప్రభావం పడే అవకాశం ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. వీరికి ఆర్థిక సమస్యలు రావడమే కాకుండా.. నష్టపోయే ఛాన్స్ కూడా ఉంది. ఈ సమయంలో వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం మానుకోండి.
మేష రాశి
మేష రాశి వారు కూడా బుధ గ్రహ సంచార సమయంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఈ సమయంలో అనేక ఆటంకాలు వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఆర్థిక వ్యవహారాలపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుందని జ్యోతిష్యులు చెప్తున్నారు. ఈ సమయంలో పని పై దృష్టి పెట్టి కాస్త కష్టపడితే అద్భుతమైన లాభాలు పొందగలుగుతారు.
సింహరాశి
సింహరాశి వారికి కూడా ఈ సమయంలో కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ప్రేమ జీవితం పరంగా కొన్ని కష్టాలు రావచ్చు. అలాగే ఖర్చులు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. కాబట్టి ఆర్థిక వ్యవహారాలపై కాస్త దృష్టి సారించడం మంచిది.
ధనస్సు రాశి
బుధుడు అస్తమించడం వల్ల ధనస్సు రాశి వారిపై కూడా ప్రత్యేకమైన ప్రభావం పడబోతోంది. దీనివల్ల ధనస్సు రాశి వారి ఆరోగ్యం క్షీణించే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆర్థిక వ్యవహారాల్లో కూడా వీరు జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడి పెట్టే సమయంలో తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter