Valentines day lovers bike stunt video: యువత ఫెమస్ అయ్యేందుకు ఏపనైన చేసేందుకు వెనుకాడటంలేదు. సోషల్ మీడియాలో ఓవన్ నైట్ లో ఫెమస్ అయ్యేందుకు నానా పాట్లు పడుతున్నారు.మెయిన్ గా యువత కార్లు, బైక్ ల మీద వెళ్తున్నప్పుడు ప్రమాదకరమైన స్టంట్ లు వేస్తున్నారు. ఇంకా పక్కన గర్ల్ ఫ్రెండ్ ఉంటే.. ఏ మాత్రం తగ్గెదెలా అన్నవిధంగా రెచ్చిపోతున్నారు.
కొంత మంది వీకెంట్ వచ్చింటే చాలు.. బైక్ ల రేసింగ్ లు, స్టంట్ లతో నానా హాంగామా చేస్తుంటారు. కొంతమంది తమ లవర్స్ లను బైక్ ల మీద తిప్పుతూ హగ్ లు ఇచ్చుకుంటూ, కిస్ లు ఇచ్చుకుంటూ నానా బీభత్సం చేస్తుంటారు. రోడ్డు మీద ఎవరైన ఉన్నారా.. అన్నది కూడా మర్చిపోయిన ముద్దుల్లో మునిగిపోతుంటారు. ప్రస్తుతం బైక్ మీద యువత డెంజరస్ స్టంట్ లు చేశారు. ఈ ఘటనపై వైరల్ గా మారింది. దీనిపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు.
'వాలంటైన్ డే' పేరుతో ఇవేం వెర్రి పనులు!!
ప్రేమికుల దినోత్సవం సందర్బంగా అదిరిపోయే స్టంట్లు అంటూ.. అదేదో ఘనత సాధించినట్లు కొన్ని జంటలు సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలను వదులుతున్నాయి.
అతి వేగంతో ప్రమాదకరరీతిలో చేసే ఈ చిత్ర విచిత్ర విన్యాసాలు మీకు సరదాగా అనిపించొచ్చు.. కానీ జరగరాని… pic.twitter.com/4cxwizkT80
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) February 13, 2025
అసలే వాలెంటైన్స్ డే వేడుకల్ని యువత ఫుల్ జోష్ గా జరుపుకుంటారు. తమ మనస్సుకు నచ్చిన వారిని ఏదో విధంగా సర్ ప్రైజ్ చేయాలని రకరకాల ప్లాన్ లు వేస్తుంటారు. అంతేకాకుండా బైక్ ల మీద షికార్లకు వెళ్తుంటారు. అంతే కాకుండా.. ర్యాష్ డ్రైవింగ్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఒక ప్రేమ జంట రోడ్డు మీద బైక్ పైస్టంట్ లు వేస్తు రెచ్చిపోయారు.
అంతే కాకుండా.. రోడ్డు మీద వెళ్తున్న ఇతరులకు ఇబ్బందులు కలిగేలా చేశారు. వీరి వెనుకాల, ముందు నుంచి వస్తున్న వాహానాలు ఎక్కడ వీరు తమను ఢీకొడతారో అని తెగ భయపడిపోయారు. అయితే.. ఈ ప్రేమ జంట ఘన కార్యంను కొంత మంది యువత తమ ఫోన్ లలో రికార్డు చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. దీంతో అది కాస్త వైరల్ గా మారింది. దీనిపై ప్రస్తుతం నెటిజన్లు మండిపడుతున్నారు.
ఈ బైక్ స్టంట్ లపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తన దైన స్టైల్ లో స్పందించారు. ఇలాంటి ప్రమాదకర స్టంట్ లు చేసేటప్పుడు ఏదైన ప్రమాదం జరిగితే.. ఆ తల్లిదండ్రులకు కలిగే వ్యథను ఒక్కసారి గుర్తు చేసుకొండని పోస్ట్ పెట్టారు. మీ స్టంట్ లు మిమ్మల్ని, ఇతరులను ప్రమాదంలో నెట్టేసే విధంగా ఉన్నాయని యువతకు చురకలు పెట్టారు. మొత్తానికి ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter