Valentines day ex lover order 100 pizzas for boy friend: సాధారణంగా వాలెంటైన్స్ డే ను యువత ఎంతో గ్రాండ్ గా చేసుకుంటారు. కొంత మంది తాము ప్రేమించిన వాళ్లకోసం ఏదైన సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇస్తుంటారు. మరికొందరు కొత్త ప్రదేశాలకు తీసుకొని వెళ్తుంటారు. కొందరు షాపింగ్ లకు , సినిమాలకు, లాంగ్ డ్రైవ్ లకు కూడా వెళ్తుంటారు. లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా ఏదో విధంగా సర్ ప్రైజ్ చేసేందుకు తెగ తాపత్రయపడుతుంటారు.
ఈ క్రమంలో ప్రస్తుతం యువతీ యువకులు లవర్స్ డేను ఎంతో గ్రాండ్గా చేసుకుంటున్నారు. అయితే.. కొంత మంది లవర్స్ డే రోజున తమ మాజీలకు ఏదో విధంగా ట్విస్ట్ ఇవ్వాలని అనుకుంటారు. తమతో బ్రేకప్ చెప్పాడని బుద్ది చెప్పాలని అనుకుంటారు. ఈ క్రమంలో ఒక యువతి తన మాజీ బాయ్ ఫ్రెండ్ కు వంద పిజ్జాలు ఆర్డర్ పెట్టింది. దీంతో ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
మాజీ ప్రియుడికి షాక్ ఇచ్చిన యువతి – వాలెంటైన్ సర్ప్రైజ్ Turns into Trouble!
వాలెంటైన్స్ డే సందర్భంగా ఓ యువతి తన మాజీ ప్రియుడికి షాకింగ్ సర్ప్రైజ్ ఇచ్చింది.
అతడికి సంతోషం కలిగించాలనే ఉద్దేశంతో 100 పిజ్జాలను ఆర్డర్ చేసింది. కానీ ట్విస్ట్ ఏమిటంటే, ఆ పిజ్జాలు క్యాష్ ఆన్ డెలివరీ… pic.twitter.com/azjqzlZkq0
— Aadhan Telugu (@AadhanTelugu) February 14, 2025
ప్రేమికుల రోజున యువతి తన మాజీపై రివేంజ్ తీర్చుకొవాలని ప్లాన్ చేసింది. దీనిలో భాగంగా అతనికి ఇష్టమైన పిజ్జాలను ఆర్డర్ పెట్టింది. అది కూడా ఒకేసారి వంద పిజ్జాలను ఆర్డర్ పెట్టింది. పాపం.. డెలీవరీ బాయ్ దాదాపు.. వంద పిజ్జాలను జాగ్రత్తగా తీసుకొచ్చి.. అందులో ఉన్న అడ్రస్ ఇంటి ముందు పెట్టాడు. ఆమె క్యాష్ ఆర్ డేలీవరీ పెట్టింది.
వెంటనే డోర్ నాక్ చేసి.. పిజ్జాలు ఆర్డర్ అని చెప్పాడు. దీంతో సదరు వ్యక్తి షాక్ అయ్యాడు. ఇదేంటీ..అని తాను.. ఆర్డర్ ఇవ్వలేదని అన్నారు. దీంతో డెలీవరీ బాయ్ తో వాగ్వాదం జరిగింది. చివరకు ఈ పని తన ఎక్స్ ది అని అతను తెలుసుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్ లు భలే ట్విస్ట్ ఇచ్చిందని నవ్వుకుంటున్నారు. మరికొందరు వామ్మో.. ఇదేం శాడిజం భయ్యా.. అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter