Weird Law : వివాహం తరువాత విడాకులు అనే కల్చర్ అనేక దేశాల్లో సాధారణం అయింది. కానీ ఫిలిప్పిన్స్‌లో (Philippines) మాత్రం విడాకులు తీసుకోవడం సాధ్యం కాదు. ఇక్కడ ఉన్న విచిత్రమైన చట్టం (Weird Law) అక్కడి దంపతులను విడాకులు తీసుకోకుండా నిరోధిస్తోంది. అక్కడి చట్టం ఎట్టిపరిస్థితిలో డైవోర్స్ తీసుకోవడాన్ని అనుమతించదు.
Also Read | Success Story: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సక్సెస్ స్టోరీ 10 పాయింట్స్ లో
ప్రపంచ వ్యాప్తంగా విడాకులు తీసుకోవడంపై ఎన్నో చట్టాలు అమలులో ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా విడాకులు తీసుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రతీ దేశం విడాకుల విషయంలో కొన్ని ప్రత్యేక చట్టాలను సిద్ధం చేసింది. ఇలాంటి పరిస్థితిలో విడాకులు (Divorce) తీసుకోకుండా నిరోధించే చట్టం ఉన్న దేశం కూడా ఉంది.
ఫిలిప్పిన్స్‌లో (Philippines) విడాకులు తీసుకోవడం సాధ్యం కాదు. అక్కడి ట్రెడిషనల్ చట్టాలు కాస్త విచిత్రంగా ఉంటాయి. అక్కడ కొన్ని సంవత్సరాల క్రితం చాలా విడాకుల కేసులు నమోదు అయ్యాయి.నిజానికి ఫిలిప్పిన్స్ అనేది కేథలిక్ (Catholic) దేశాల్లో ఒక భాగం. కేథలిక్ చర్చ్‌ల (Catholic Church) వల్ల అక్కడ విడాకులు తీసుకోవడం కుదరని పని.
Also Read | Does Snake Drink Milk: పాములు పాలు తాగుతాయా? 5 అపోహలు, 5 వాస్తవాలు!
2015లో పోప్ ఫ్రాన్సిన్ (Pope Francis) ఫిలిప్పిన్స్ వెళ్లినప్పుడు ఆయన అక్కడి ధర్మగురువులతో మాట్లాడుతూ విడాకులు తీసుకోవాలి అనుకుంటున్న వారిపై దయ చూపి వారి కోరిక నెరవేర్చమని కోరారు. కానీ ఫిలిప్పిన్స్‌లో విడాకులు తీసుకున్న కేథలిక్ ఉండటం అనేది అంగీకారయోగ్యం కాదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe