Google YouTube Bonalu: 'గూగుల్‌ అమ్మ, యూట్యూబ్‌ తల్లి బోనాలు'.. వీటి ప్రత్యేక ఏమిటో తెలుసా?

Artists Celebrates Google Amma Bonalu And YouTube Bonalu: బోనాలు అంటే గ్రామ దేవతలకు సంబంధించినవి. కానీ గూగుల్‌ అమ్మ బోనాలు.. యూట్యూబ్‌ తల్లి బోనాలు విన్నారా ఎప్పుడైనా? కళాకారులు చేసుకున్న ఈ సరికొత్త బోనాల ఉత్సవాల ఏమిటో చూద్దాం!

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 5, 2025, 04:40 PM IST
Google YouTube Bonalu: 'గూగుల్‌ అమ్మ, యూట్యూబ్‌ తల్లి బోనాలు'.. వీటి ప్రత్యేక ఏమిటో తెలుసా?

Google Amma Bonalu And YouTube Bonalu: తెలంగాణలో బోనాల పండుగ అత్యంత వైభవంగా జరుగుతాయి. స్థానిక ఆచారాలను బట్టి ఏడాదిలో ఒకసారి జరుగుతుంటాయి. వేర్వేరు చోట్ల వేర్వేరు సమయాల్లో బోనాలు జరుగుతుంటాయి. బోనాలు అంటే గ్రామ దేవతలకు ఉంటాయి. కానీ తమకు జీవనం ఇస్తున్న గూగుల్‌, యూట్యూబ్‌లకు కూడా బోనాలు సమర్పించడం వింతగా ఉంది కదా? అవును గూగుల్‌ అమ్మకు బోనాలు.. యూట్యూబ్‌ తల్లికి బోనాలు అంటూ నిర్వహిస్తున్న ఈ బోనాల గురించి తెలుసుకుందాం.

Also Read: Viral Video: బుడ్డోడి దేశభక్తికి 'భరతమాత' ఫిదా.. నెట్టింట్లో వైరల్‌గా వీడియో

తెలంగాణ అంటే జానపదాలకు అడ్డాగా చెప్పవచ్చు. యూట్యూబ్‌, గూగుల్‌ వచ్చాక తెలంగాణ జానపద సంగీతం.. కళలకు మరింత ప్రాచుర్యం దక్కింది. దీంతో కొత్త కళాకారులు వెలుగులోకి వస్తున్నారు. ఇలా గూగుల్‌, యూట్యూబ్‌ ద్వారా గుర్తింపు పొందిన కళాకారులంతా కలిసి తమకు జీవనోపాధి కల్పించిన గూగుల్‌, యూట్యూబ్‌లకు ఎంతో ప్రేమగా బోనాలు సమర్పిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బుధవారం తెలంగాణ కళాకారులు బోనాల వేడుక నిర్వహించారు.

Also Read: Zee Tv Sa Re Ga Ma Pa: ప్రతిష్టాత్మక వేదికలపై 'జీ సరిగమప' సింగర్‌ల అద్భుత ప్రదర్శన

వేములవాడ పట్టణంలో యూట్యూబ్ తల్లి, గూగుల్ అమ్మ బోనం పేరిట బద్ది పోచమ్మ అమ్మవారికి జానపద గాయనీ గాయకులు, డ్యాన్సర్లు, నటీనటులు బోనాలు సమర్పించారు. కళాకారుల ఐక్యత కోసం యూట్యూబ్ తల్లి, గూగుల్ అమ్మ బోనాలను ఏర్పాటు చేశామని 'పుష్ప' సినిమా 'సామి సామి' గాయని మౌనిక యాదవ్‌ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐటీఎఫ్ రెండో వార్షికోత్సవం పురస్కరించుకొని  బద్ది పోచమ్మ అమ్మవారికి  బోనాలు సమర్పించుకున్నట్లు వెల్లడించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో కళాకారులు ఈ బోనాల వేడుకల్లో హాజరయ్యారు. బద్ది పోచమ్మ అమ్మవారి కి బోనాలు సమర్పించిన అనంతరం భోజనాలు చేశారు. ఈ సందర్భంగా కళాకారులు అంతా ఒక చోటకు చేరడంతో సందడిగా మారింది. ప్రతియేటా ఇదే మాదిరి గూగుల్‌ అమ్మ, యూట్యూబ్‌ తల్లికి బోనాలు సమర్పిస్తామని కళాకారులు చెబుతున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News