Highly Venomous Snake: తెలుగు రాష్ట్రాల్లో పాములు హల్‌చల్ చేస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రతలతో అడవుల నుంచి జన బాహుళ్యంలోకి వస్తున్నాయి. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే ఓ కలెక్టర్ కార్యాలయంలోకి అత్యంత విషపూరితమైన పాము దూసుకెళ్లింది. దీంతో ఉద్యోగులు, అధికారులు భయాందోళన చెందారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో నాగుపాము హల్‌చల్ చేసింది. ప్రఖ్యాత మహానంది ఆలయంలో నాగుపాము కనిపించడంతో భక్తులు భయాందోళన చెందారు. ఈ రెండు సంఘటనల వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Komatireddy Brothers: అన్న ఆరాటం-తమ్ముడి పోరాటం.. ఆగమాగంలో 'కోమటిరెడ్డి బ్రదర్స్'
తెలంగాణలో..
నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో కొండచిలువలు కలకలం రేపాయి. కింది అంతస్తులోని కార్యాలయ వెనుక భాగంలో చెట్ల పొదల్లో శనివారం రెండు కొండ చిలువలు కనిపించాయి. వీటిని చూసిన ఉద్యోగులు ఉలిక్కిపడ్డారు. కార్యాలయానికి విధులు నిర్వహించడానికి వెనుక భాగంలో ఏదో కదులుతున్నట్లుగా గమనించారు. పాములు ఉన్నట్లు గుర్తించి వెంటనే పాములు పట్టేవారికి సమాచారం అందించారు. వచ్చిన ఓ యువకుడు బుసలు కొడుతున్న పామును చాకచక్యంగా పట్టుకున్నాడు. అనంతరం ఆ కొండ చిలువను జాగ్రత్తగా ఓ ప్లాస్టిక్ డబ్బాలో బంధించాడు.
ఊపిరి పీల్చుకున్న ఉద్యోగులు
ఈ పాము సుమారు 6 అడుగుల పైన ఉంది స్నేక్ సహాయకుడు తెలిపాడు. అవి కొండ చిలువ కాదని అత్యంత ప్రమాదకరమైన రక్తపింజరి అని తెలిపాడు. వేసవి కాలం కావడంతో వేడిని తాళలేక అటవీ ప్రాంతం నుంచి పాములు బయటకు వస్తుంటాయని ప్రజలు జాగ్రత్త పడాలని సూచించారు. రెండు కొండ చిలువలు కనిపించడంతో ఉద్యోగులంతా ఒక్కసారిగా భయాందోళనకు గురవగా.. వాటిని పట్టుకోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
Also Read: YS Jagan Shock: సొంత జిల్లాలో జగన్ కు షాక్? తెలుగుదేశం 'మేడా' ఎక్కనున్నారా?
ఆంధ్రప్రదేశ్‌లో..
ఏపీలోని నంద్యాల జిల్లా మహానంది ఆలయ సమీపంలో శుక్రవారం సాయంత్రం నాగుపాము హల్‌చల్ చేసింది. ఆలయ ఆవరణలో నాగుపామును చూసిన భక్తులు భయాందోళనకు గురయ్యారు. కొందరు ఆ పాముకు పాలు అందించారు. ఆలయంలో కనిపించడంతో కొందరు పూజలు చేశారు. సమాచారం అందుకున్న స్నేక్ స్నాచర్ మోహన్ నాగుపామును చాకచక్యంగా పట్టుకున్నాడు. అనంతరం జాగ్రత్తగా సమీపంలోని అడవుల్లో వదిలేశాడు. ఈ రెండు వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.