phone blast in woman pant video viral: ప్రస్తుతం చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు ప్రతి ఒక్కరు మొబైల్ ఫోన్ లను తప్పకుండా ఉపయోగిస్తున్నారు. దీని వల్ల లాభాలు ఎంతగా ఉన్నాయో.. నష్టాలు కూడా అంతే ఉన్నాయి. ఒక్క నిమిషం మొబైల్ కన్పించకపోతే.. చాలా మంది కొంపలు మునిగిపోయినట్లు ఫీల్ అవుతారు. కొంత మంది మొబైల్ ఫోన్ లకు బానిసలుగా మారిపోయి, తమ వ్యక్తిగత పనులు కూడా చేసుకొకుండా.. అదేలోకం అన్నట్లుగా ఉంటున్నారు.
ఈ క్రమంలో ఫోన్ లను రోడ్ల మీద, బైటకు వెళ్లినప్పుడు ఉపయోగిస్తు కొంత మంది తమ ప్రాణాలను సైతం రిస్క్ లో పడేసుకుంటున్నారు. అయితే.. కొన్ని సార్లు ఫోన్ లలో సమస్యలు తలెత్తి అవే పేలిపోతున్న ఘటనలు కూడా లేకపోలేదు.
Terrifying moment as a #Brazilian woman's cell phone explodes in her pocket, leaving her with severe burns.
8th #February2025 #SafetyFirst #TechRisks #BurnInjury #CellPhoneExplosions #brazil #mobile #Fire pic.twitter.com/6KKO1ffgVe— Ali Shunnaq (@schunnaq) February 12, 2025
తాజాగా.. అచ్చం ఇలాంటి ఘటన బ్రెజిల్ లో చోటు చేసుకుంది. ఒక మహిళ తన భర్తతో కలిసి సూపర్ మార్కెట్ కు వచ్చింది. ఆమె తన ప్యాంట్ వెనుక జేబులో ఫోన్ పెట్టుకుంది. ఏంజరిగిందో ఏంటో కానీ ఆ మొబైల్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో ఆమె ఉలిక్కి పడింది. ప్యాంట్ కు మంటలు అంటుకున్నాయి. ఆమె గట్టిగా కేకలు పెట్టింది. చుట్టుపక్కల వారు కూడా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.
Read more: Hyderabad: హనుమాన్ ఆలయంలో మహా అపచారం.. ఆవు మాంసం ముద్దలు పడేసిన ఆగంతకులు.. వీడియో వైరల్..
ఆమె భర్త మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో మహిళ చేతులు, ఆమె భర్త చేతులకు కూడా గాయాలయ్యాయి. వెంటనే వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter