King Cobra Kiss Viral Video, Snake Catcher Arjun kisses 12 feet King Cobra: కింగ్ కోబ్రా.. అత్యంత విషపూరితమైన పాములలో ఒకటి. ఇది పాములన్నింటిలో కెల్లా అత్యంత పొడవైనది కూడా. ఇది ఆగ్నేయ ఆసియాలోని అడవులలో ఎక్కువగా కనిపిస్తుంది. భారత దేశంలో కూడా అక్కడక్కడా ఉన్నాయి. కింగ్ కోబ్రా కాటు వేసిందంటే 15 నిమిషాల్లో మనిషి చనిపోతాడు. కింగ్ కోబ్రా ఒక్క కాటులో ఉండే విషం 20 మందిని లేదా 7 ఏనుగులను చంపగలదు. అలాంటి కింగ్ కోబ్రాతో ఓ వ్యక్తి ఆటాడుకున్నాడు. అంతేకాదు దానికి కిస్ చేశాడు కూడా. ప్రస్తుతం ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
స్నేక్ అర్జున్ అనే వ్యక్తి డేరింగ్ స్నేక్ క్యాచర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎంత డేంజరస్ స్నేక్స్‌ని అయినా.. చాలా సులువుగా పట్టుకుంటాడు. 12 అడుగుల కింగ్ కోబ్రాను సైతం ఉత్త చేతులతోనే పట్టుకుంటాడు. అర్జున్‌కు సొంత యూట్యూబ్ ఛానెల్ (Snake arjun chikkamagaluru) కూడా ఉంది. ఆ ఛానెల్లో స్నేక్ క్యాచింగ్ వీడియోలు, విషపూరిత జంతువుల వీడియోలే ఉంటాయి. ఎక్కువగా కింగ్ కోబ్రాకు సంబందించిన వీడియోలు అతడు పోస్ట్ చేస్తుంటాడు. ఈ క్రమంలోనే కింగ్ కోబ్రాను కిస్ చేసిన వీడియోను పోస్ట్ చేశాడు.
ఓ అడవి ప్రాంతంలో స్నేక్ అర్జున్ 12 అడుగుల కింగ్ కోబ్రాను పట్టుకుంటాడు. ఖాళీ ప్రదేశంలోకి తీసుకొచ్చి పడగవిప్పిన కింగ్ కోబ్రాతో ఆటలు ఆడతాడు. పడగవిప్పిన కింగ్ కోబ్రా ఎలా నాలుకతో అంటుందో.. అర్జున్ కూడా అలానే అంటాడు. చాలా దగ్గర నుంచి కింగ్ కోబ్రా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తాడు. ఆపై పాము తల దగ్గరకు ముక్కు తీసుకెళ్లి మరీ వాసన చూస్తాడు. అయినా కూడా అది ఏమీ అనదు. కొంత సమయానికి అది కాటువేయడానికి ప్రయత్నించగా.. అర్జున్ తప్పించుకుంటాడు.
కింగ్ కోబ్రా కాటువేయడానికి ప్రయత్నించినా కూడా అర్జున్ వెనక్కి తగ్గడు. మరోసారి దాని వద్దకు వెళ్లి ముక్కుతో వాసన చూస్తాడు. ఆపై పడగవిప్పిన కింగ్ కోబ్రాను కిస్ చేస్తాడు. ఈ వీడియో పాతదే అయినా ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన అందరూ లైకుల, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అర్జున్ గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Dinesh Karthik: కలలు నిజమవుతాయి.. దినేశ్ కార్తీక్ భావోద్వేగం! ఆ ఒక్క మాటతో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook