Elephants attacks in kerala temple video viral: సాధారణంగా ఉత్సవాలలో, దేవుని కార్యక్రమాలలో ఏనుగులను తీసుకొస్తుంటారు. వీటిని అందంగా అలంకరణ చేసి.. ఉత్సవ విగ్రహాలను ఏనుగులపై పెట్టి ఊరేగిస్తుంటారు. అంతే కాకుండా.. ఏనుగుల మీద దేవుళ్లను పెట్టి.. తొండంతో భక్తుల్ని ఆశీర్వాదం ఇచ్చేలా మావాటి వాళ్లు చేస్తుంటారు. ఏనుగుల పక్కన మావటివాళ్లు ఉంటూ వాటిని కంట్రోల్ చేస్తుంటారు.
అయితే.. కొన్నిసార్లు ఏనుగుల దగ్గరకు కొంత మంది ఫోటోల కోసం వెళ్తుంటారు. మరికొందరు టపాసులు కాలుస్తుంటారు. ఇలాంటి సందర్భాలలో ఏనుగులు కోపంతో రెచ్చిపోతుంటాయి. అవి అదుపుతప్పి దాడులు సైతం చేస్తుంటారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఒక షాకింగ్ ఘటన వైరల్‌గా మారింది. దీనిలో కేరళలోని కోజికోడ్ జిల్లా కోయిలండిలో విషాదం నెలకొంది. మణక్కులంగర భగవతి గుడిలో ఉత్సవాల సందర్భంగా పీతాంబరం, గోకుల్ అనే రెండు ఏనుగుల్ని తీసుకొచ్చారు. అయితే.. అక్కడ ఉత్సవాలలో కొంత మంది యువత టపాసులు కాల్చారు.
#Kerala: Officials of the Manakulangara temple in Koyilandy have denied claims that firecrackers triggered the elephant rampage that led to the deaths of three people during the temple festival.
They asserted that the firecrackers were burst far from where the elephants were… pic.twitter.com/fyz8ZJON2O— South First (@TheSouthfirst) February 14, 2025
ఆ ఏనుగులు ఒక్కసారిగా భయంతో పరుగులు పెట్టాయి. మావటి వాళ్లు కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించిన ఆ ఏనుగులు అదుపు తప్పాయి. చాలా సేపు అటు ఇటు తిరుగుతూ.. కన్పించిన వాళ్ల మీద దాడులు చేస్తు ముందుకు వెళ్లిపోయాయి. ఏనుగుల్ని చూసి భయంతొ భక్తులు దూరంగా పరుగులు పెట్టారు. ఆ ఏనుగుల కాళ్ల కింద పడి.. ముగ్గురు భక్తులు చనిపోయారు. దాదాపు.. 40 కిపైగా మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
వీరిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మొత్తంగా ఏనుగుల బీభత్సం చేస్తున్న వీడియోలు అక్కడున్న సీసీ కెమెరాలోరికార్డు అయ్యింది. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవల కాలంలో కేరళలో ఆలయంలోని ఉత్సవాలలో ఏనుగులు బీభత్సం చేయడం తరచుగా వార్తలలో ఉంటున్నాయి. ఏనుగులు ఉన్నప్పుడు టపాసులు, ఫోటోలు తీయడం వంటి వాటికి దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter