Bride and groom funny video goes viral: సోషల్ మీడియాలో ప్రతిరోజు అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొన్ని ఘటనలు ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేసేవిలా ఉంటున్నాయి. పెళ్లి సంబంధించిన ఫన్నీ వీడియోలు ఇటీవల ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి. మరి కావాలని చేస్తున్నారో.. అనుకొకుండా జరుగుతున్నాయో.. కానీ మొత్తానికి పెళ్లిలో జరిగిన ఫన్నీ సన్నివేశంలో ఆ పెళ్లి కాస్త వార్తలలో ఉంటుంది.
పెళ్లిలో వెరైటీగా ఎంట్రీ ఇవ్వడం, పెళ్లిలో డ్యాన్స్ లు చేయడం, అనుకొకుండా గొడవలుజరిగి పెళ్లిళ్లు ఆగిపోయిన ఘటనలు అనేకం వైరల్ అయ్యాయి. అంతే కాకుండా.. ఇటీవల పెళ్లి పీటల మీద కట్నం ఇవ్వలేదని, తాగి వచ్చాడని, ఇంగ్లీష్ రావడంలేదని కూడా పెళ్లి మధ్యలో క్యాన్షిల్ చేసుకుని మరీ వెళ్లిపోయిన సంఘటనలు కొకొల్లలు.
ఈ క్రమంలో ప్రస్తుతం ఒక పెళ్లికొడుకు.. వధువును రిక్షా బండి మీద తీసుకెళ్తున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. వైరల్ అవుతున్న వీడియోలో.. కొత్త పెళ్లి కొడుకు వధువును.. రిక్షా బండి మీదకూర్చుని తీసుకెళ్తున్నాడు.
అతను ఆమెను ఎక్కడికి, ఎందుకు తీసుకెళ్తున్నాడో తెలీదు కానీ.. కొంత మంది మాత్రం.. వధువును అమ్మకానికి తీసుకెళ్తున్నాడని ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారంట. మరికొందరు వారిద్దరు ఏదో ప్రాంక్ వీడియోలు తీసుకుంటున్నట్లు ఉన్నారని అంటున్నారు. మొత్తానికి వధువు, వరుడు చేసిన తింగరి పని మాత్రం ప్రస్తుతం వార్తలలో నిలిచిందని చెప్పుకొవచ్చు.