Indian Space Research Organisation: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఆదివారం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి LVM3 (GSLV-Mk III) రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించింది. 43.5 మీటర్ల పొడవైన LVM 3 రాకెట్ 5.8 టన్నుల బరువున్న 36 ఉపగ్రహాలను నింగిలోకి ప్రవేశపెట్టారు. తాజాగా ప్రవేశపెట్టిన ఉపగ్రహాలన్నీ బ్రిటన్ సంస్థ అయిన వన్ వెబ్ (OneWeb)కు చెందినవి.
ఇస్రో ఈ మిషన్‌కు LVM3-M3/OneWeb India-2 అని పేరు పెట్టింది. ఎల్‌వీఎం-3 అనేది మూడు-దశల రాకెట్. దీని మొదటి దశలో ద్రవ ఇంధనం, రెండు స్ట్రాప్-ఆన్ మోటార్లు ఘన ఇంధనం, రెండవది ద్రవ ఇంధనం మరియు మూడవది క్రయోజెనిక్ ఇంజిన్‌ల ద్వారా శక్తిని పొందుతాయి. ఈ రాకెట్ చంద్రయాన్-2 మిషన్‌తో సహా వరుసగా ఐదు విజయవంతమైన మిషన్‌లను నిర్వహించింది.
ఈ ప్రయోగంతో మనదేశం 1999 నుంచి ఇప్పటి వరకు ప్రయోగించిన మెుత్తం విదేశీ ఉపగ్రహాల సంఖ్య 422కు చేరింది. ప్రస్తుతం కక్ష్యలో వన్ వెబ్‌కి సంబంధించి 582 శాటిలైట్స్ ఉన్నాయి. ఆదివారం నాటి ప్రయోగం వన్‌వెబ్‌కి 18వ ప్రయోగం. 1,000 కోట్ల రూపాయలకు పైగా ప్రయోగ రుసుముతో రెండు దశల్లో 72 ఉపగ్రహాలను ప్రయోగించేందుకు ISRO యొక్క వాణిజ్య విభాగమైన NewSpace India Limited (NSIL) వన్ వెబ్ తో ఒప్పందం కుదుర్చుకుంది. 36 ఉపగ్రహాల మొదటి బ్యాచ్ అక్టోబర్ 23, 2022న ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుండి ఎల్‌వీఎం-3 రాకెట్ ద్వారా ప్రయోగించారు. తాజాగా రెండో విడత 36 ఉపగ్రహాలను నింగిలోకి పంపించారు.
#WATCH | Andhra Pradesh: The Indian Space Research Organisation (ISRO) launches India’s largest LVM3 rocket carrying 36 satellites from Sriharikota
(Source: ISRO) pic.twitter.com/jBC5bVvmTy
— ANI (@ANI) March 26, 2023
Also Read: 8th Pay Commission: కేంద్ర ప్రభుత్వం సూపర్ గిఫ్ట్.. ఉద్యోగులకు డబుల్ బెనిఫిట్..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK
ISRO: ఎల్‌వీఎం-3 రాకెట్ ప్రయోగం సక్సెస్.. ఒకేసారి నింగిలోకి 36 ఉపగ్రహాలు..