Musharraf Passed Away: పాకిస్థాన్ ఆర్మీ మాజీ చీఫ్, మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ యూఏఈలోని అమెరికన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. ముషారఫ్ మరణ వార్తను ఆయన కుటుంబ సభ్యులు ధృవీకరించారు. అనారోగ్యం కారణంగా రెండు వారాలుగా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన వయసు 78 ఏళ్లు.
మార్చి 2016 నుంచి దుబాయ్‌లో ఉన్న ముషారఫ్ అమిలోయిడోసిస్‌కు చికిత్స పొందుతున్నారు. ఇది ఓ అరుదైన వ్యాధి. జూన్ 10న ముషారఫ్ అనారోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు ట్విట్టర్‌లో ఒక ప్రకటన విడుదల చేశారు. ముషారఫ్ కోలుకోవడం సాధ్యం కాదని.. అవయవాలు పనిచేయని దశలో ఉన్నారని చెప్పారు. "ముషారఫ్ వెంటిలేటర్‌లో లేరు. గత 3 వారాలుగా ఆసుపత్రిలో ఉన్నారు. ఆయన అనారోగ్యం (అమిలోయిడోసిస్) సంక్లిష్టత కారణంగా కోలుకోవడం సాధ్యం కాదు. అవయవాలు పనిచేయక క్లిష్ట దశలో ఉన్నాయి. ఆయన రోజువారీ జీవితంలో సంతోషంగా ఉండటానికి ప్రార్థించండి" అని కుటుంబ సభ్యులు గతంలో కోరారు.
బ్రిటీష్ పరిపాలనలో 1943 ఆగస్టు 11న ఢిల్లీలో ముషారఫ్ జన్మించారు. భారత్, పాక్ విడిపోయిన తరువాత కుటుంబంతో కలిసి పాకిస్థాన్‌కు వెళ్లిపోయారు. ఆ తరువాత ఆయన సైన్యంలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. 1999లో సైనిక తిరుగుబాటులో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. జూన్ 2001లో పాకిస్థాన్ అధ్యక్షుడిగా, దేశాధినేతగా ప్రమాణ స్వీకారం చేశారు. 2008 వరకు పాకిస్థాన్ అధ్యక్షుడిగా పనిచేశారు. కార్గిల్ యుద్ధానికి ఆయనే ప్రధాన కారకుడు.
2007లో పాకిస్థాన్‌లో ఎమర్జెన్సీ విధించినందుకు, రాజ్యాంగాన్ని సస్పెండ్ చేసినందుకు 2013లో పర్వేజ్ ముషారఫ్‌పై దేశద్రోహం కేసు నమోదైంది. 2014 మార్చి 31న ముషారఫ్‌ను కోర్టు దోషిగా నిర్ధారించింది. ఆయన కోర్టు ముషారఫ్‌కు ఉరిశిక్ష విధించింది. అయితే పాక్ నుంచి వెళ్లిపోయి దుబాయ్‌లో తల దాచుకుంటున్నారు. అరుదైన వ్యాధికి చికిత్స పొందుతున్న ఆయన.. చివరికి తుదిశ్వాస విడిచారు. ఇంతకు ముందు కూడా, ఆయన మరణ వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ముషారఫ్ కుటుంబం ఆ వార్తలను ఖండించింది.
Also Read: IND Vs AUS: ఆసీస్-భారత్ టెస్ట్ సిరీస్.. ఈ ఐదుగురు ఆటగాళ్లపై ఓ లుక్కేయండి
Also Read: Nellore Mayor Sravanthi: నెల్లూరులో వైసీపీకి మరో షాక్.. కోటంరెడ్డికే జై కొట్టిన మేయర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook