In Goa Kejriwal promises allowance for unemployed 80% quota in jobs for locals: త్వరలో గోవా అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. గోవాలో అధికారం చేజిక్కించుకోవడానికి ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో వ్యూహాలు సిద్ధం చేసింది. గోవా ఎన్నికల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ హామీల వర్షం కురిపిస్తోంది.
ఇక వచ్చే సంవత్సరం వివిధ రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో బరిలోకి దిగనుంది ఆమ్ ఆద్మీ పార్టీ. అందుకే ఇప్పటి నుంచే ఎన్నికల కసరత్తు మొదలు పెట్టింది. గోవాతో పాటు పంజాబ్ ఎన్నికలపైన ఆమ్ ఆద్మీ ఫోకస్ చేస్తోంది. తాజాగా ఉత్తరాఖండ్‌లోనూ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (delhi cm arvind kejriwal) పర్యటించారు. ఉత్తరాఖండ్‌లోని (uttarakhand) హల్ద్వానీలో అనేక హామీలు ఇచ్చారు. ఉత్తరాఖండ్‌లో అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వచ్చే వరకు నెలకు ఐదు వేల రూపాయలు ఇస్తామని, ఉద్యోగాల్లో స్థానికులకు 80 శాతం కోటా ఇస్తామని వెల్లడించారు.
ఇప్పుడు తాజాగా అదే తరహాలో గోవా యువతకు కూడా హామీలు ఇచ్చారు ఆమ్ అరవింద్ కేజ్రీవాల్ . గోవా (Goa) ఒక అందమైన రాష్ట్రం , భగవంతుడు గోవాకు అన్నీ ఇచ్చాడని, కానీ రాజకీయ పార్టీలు గోవాను దోపిడీ చేశాయని అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. మేము ఈ దోపిడీని అరికట్టాలని విస్తృతమైన ప్రణాళికను రూపొందించామని కేజ్రీవాల్ పేర్కొన్నారు. గోవాలో 300 యూనిట్ల విద్యుత్ ఉచితంగా (free electricity) ఇస్తామని వెల్లడించారు. అంతేకాదు రైతుల విద్యుత్ బిల్లులను ప్రభుత్వం పూర్తిగా చెల్లిస్తుందని చెప్పారు. గోవా ప్రజలకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
గోవాలో 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇస్తామని, నిరుద్యోగ భృతి( unemployment allowance) చెల్లిస్తామని అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. గోవా యువతకు ప్రధానంగా 7 హామీలు (7 promises) ఇచ్చారు కేజ్రీవాల్. ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చిన హామీలు ఇలా ఉన్నాయి.
7 హామీలు
"ఎమ్మెల్యే సంబంధికులకు కాదు గోవావాసులకు ఉద్యోగాలు కల్పిస్తాం. కుటుంబానికో ఉద్యోగం ఇస్తాం. ఉద్యోగం వచ్చే వరకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తాం. ప్రైవేటు ఉద్యోగాల్లో 80 శాతం గోవావాసులకే ప్రాధాన్యత ఉంటుంది. కరోనాతో నిరుద్యోగులైన పర్యాటక శాఖకు చెందినవారికి రూ.5 వేల ఆర్థిక సహాయం అందిస్తాం. మైనింగ్ (Mining) తవ్వకాల నిషేధంతో ప్రభావితులైన వారికి రూ.5 వేల ఆర్థిక సహాయం చేస్తాం. స్కిల్ యూనివర్సిటీ (skill university) ఏర్పాటు చేస్తాం." అంటూ అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. మొత్తానికి యువతకు ఉద్యోగ, ఉపాధికి సంబంధించే అరవింద్ కేజ్రీవాల్ ప్రధాన హామీలున్నాయి. ఢిల్లీలో తాము చేపడుతున్న పాలన తరహాలోనే గోవాలో కూడా మంచి పాలన సాగిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ చెబుతోంది.
My 7 Guarantees for Goa's youth
▪️Jobs for Goans, not just for MLA's relatives
▪️1 Job/family for unemployed
▪️3000/month until then
▪️80% pvt jobs reserved for Goans
▪️5000/month for unemployed in tourism due to COVID
▪️5000/month for mining ban affected
▪️Skill University
— Arvind Kejriwal (@ArvindKejriwal) September 21, 2021
Also Read : First flying car : భారత్ నుంచే ఏషియా తొలి ఫ్లయింగ్ కారు వస్తుందన్న కేంద్ర మంత్రి
కాపీ కొట్టే డూప్లికేట్ పార్టీ అవసరామా
ఇక గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌పై (Pramod Sawant) అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. గోవాలో ప్రమోద్ సావంత్ ఈమధ్య నీటిని ఉచితంగా అందించారని ,తాము నాలుగు సంవత్సరాల క్రితమే ఢిల్లీలో (delhi) ఈ విధానాన్ని అమలు చేశామని వెల్లడించారు.
Why vote for "Duplicate" when you can vote for the "Original"?
- CM @ArvindKejriwal on BJP's CM Sawant COPYING Free water & Doorstep services scheme of Delhi Govt#KejriwalKiJobGuarantee pic.twitter.com/jIdThu7mym
— AAP (@AamAadmiParty) September 21, 2021
సావంత్ డోర్‌స్టెప్ డెలివరీ ప్రారంభించాడని ,మేము మూడు సంవత్సరాల క్రితమే చేశామని పేర్కొన్నారు. ప్రమోద్ సావంత్ గోవాలో 'ఢిల్లీ మోడల్' కాపీ చేస్తున్నాడని ఆరోపించారు. అయినా అసలు ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) అందుబాటులో ఉన్నప్పుడు కాపీ కొట్టే డూప్లికేట్ పార్టీ అవసరామా అంటూ అరవింద్ కేజ్రీవాల్ (arvind kejriwal) ప్రశ్నించారు.
गोंयच्या युवांखातीर आनी तांच्या रोजगाराकडेन संबंधीत म्हत्वपूर्ण घोशणा | LIVE https://t.co/nOf0RtLpMV
— Arvind Kejriwal (@ArvindKejriwal) September 21, 2021
Also Read : Shocking Video:కార్లో ఎలుగుబంటి...గుండె ఆగినంత పని.. నవ్వులు పూయిస్తున్న వీడియో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook