Madhya Pradesh Bypolls 2020: Congress mla Rahul Lodhi joins BJP: భోపాల్: దేశమంతటా ఓ వైపు బీహార్ అసెంబ్లీ ఎన్నికలు.. మరోవైపు పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల హడావుడి నెలకొంది. మధ్యప్రదేశ్ (madhya pradesh ) లో కూడా పలు స్థానాల్లో ఉప ఎన్నికలు (mp bypolls 2020) జరగనున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని చేజార్చుకున్న కాంగ్రెస్ పార్టీకి.. సరిగ్గా ఉప ఎన్నికలు సమీపిస్తుండంగానే ఆపార్టీకి చెందిన ఎమ్మెల్యే రాహుల్ లోధి (rahul lodhi ) ఆదివారం భారతీయ జనతా పార్టీ (BJP) లో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh Chouhan) బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Madhya Pradesh: Rahul Lodhi joins BJP (Bharatiya Janata Party), in presence of Chief Minister Shivraj Singh Chouhan. https://t.co/KQN1NWZdsZ pic.twitter.com/QOy2cavd3q
— ANI (@ANI) October 25, 2020
అయితే బీజేపీలో చేరేముందు కాంగ్రెస్ పార్టీతో సహా అసెంబ్లీ సభ్యత్వానికి కూడా రాహుల్ సింగ్ రాజీనామా చేశారు. ఈ సందర్భంగా రాహుల్ లోధి మాట్లాడుతూ.. బీజేపీలో తన ఇష్ట పూర్వకంగానే చేరుతున్నానని తెలిపారు. రాబోయే రోజుల్లో తన నియోజకవర్గం దామో ఉన్నత స్థానానికి చేరుతుందనే విశ్వాసంతోనే బీజేపీలోకి చేరినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు దామో (Damoh) నియోజకవర్గానికి చెందిన రాహుల్ లోధి తన రాజీనామా లేఖను ప్రొటెం స్పీకర్ రామేశ్వర్ శర్మకు అందజేశారు. అనంతరం నేరుగా బీజేపీ కార్యాలయానికి వెళ్లి సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సమక్షంలో రాహుల్ లోధి బీజేపీలో చేరారు. Also read: Bihar Assembly Elections: లాలూ విడుదలైన మరుసటి రోజే సీఎం నితీశ్‌కు వీడ్కోలు: తేజస్వీ
ఇదిలాఉంటే.. కాంగ్రెస్ కమల్‌నాథ్ (Kamal Nath) ప్రభుత్వం కూలిపోయి బీజేపీ చౌహాన్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం.. రాహుల్ లోధితో కలిపి ఇప్పటి వరకు బీజేపీలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య నాలుగుకు చేరింది. అయితే రాహుల్ లోధి కాంగ్రెస్ తరుపున దామో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇదిలాఉంటే.. రాష్ట్రంలో ఉపఎన్నికల పోలింగ్‌కు సరిగ్గా ఎనిమిది రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యే బీజేపీలో చేరడంతో ఆ పార్టీ శ్రేణుల్లో తీవ్ర నిరుత్సాహం నెలకొంది. Also read: Tejashwi Yadav: సీఎం అభ్యర్థికి చేదు అనుభవం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe