YS Vijayamma: కారు ప్రమాదం వార్తలపై కలత.. టీడీపీ సోషల్ మీడియాకు ఇచ్చిపడేసిన వైఎస్‌ విజయమ్మ

YS Vijayamma Car Accident: కారు ప్రమాదంతో తన హత్యకు కుట్ర చేశారని వస్తున్న వార్తలను వైఎస్‌ విజయమ్మ ఖండించారు. తన కుమారుడు పేరు పెట్టి దుష్ప్రచారం చేయడాన్ని ఆమె తప్పుబట్టారు. ఇది జుగుప్సకరమని పేర్కొన్నారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Nov 4, 2024, 05:12 PM IST
YS Vijayamma: కారు ప్రమాదం వార్తలపై కలత.. టీడీపీ సోషల్ మీడియాకు ఇచ్చిపడేసిన వైఎస్‌ విజయమ్మ

YS Vijayamma Clarifies Car Accident: కొన్ని రోజులుగా తన కుటుంబాన్ని రాజకీయాల్లోకి లాగడం.. ఆస్తి వివాదాలు రచ్చకెక్కడంపై తీవ్ర దుమారం రేపుతోంది. ఆస్తి వివాదాలు పక్కనపెడితే వైఎస్‌ జగన్‌ సొంత తల్లి విజయమ్మను హత్య చేసేందుకు కుట్ర పన్నారని.. కారు ప్రమాదం అందులో భాగమని టీడీపీ అధికారికంగా ప్రకటించడం సంచలనంగా మారింది. దీనిపై కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతుండడంతో వైఎస్‌ విజయమ్మ స్వయంగా స్పందించారు. తన కారు ప్రమాదంపై వస్తున్న వార్తలను ఖండించారు.

Also Read: YS Vijayamma: విజయమ్మ హత్యకు వైఎస్‌ జగన్‌ కుట్ర? మరో బాంబు పేల్చిన తెలుగుదేశం పార్టీ

ఆ వార్తలు తనను ఎంతో కలచివేశాయని.. ఇంతటి నీచ నికృష్టంగా మాట్లాడడం.. రాజకీయం చేయడాన్ని విజయమ్మ తప్పుబట్టారు. ఈ సందర్భంగా ఆమె విడుదల చేసిన లేఖ చర్చనీయాంశంగా మారింది. 'రెండు రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం నన్ను తీవ్రంగా కలచి వేస్తోంది. కొంతమంది సోషల్ మీడియాలో లేనిపోని అసత్య కథనాలు ప్రచారం చేయడం చూస్తుంటే నాకు తీవ్ర మానసిక వేదన కలుగుతోంది' అని ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read: Pawan Kalyan: వైఎస్‌ జగన్‌ నుంచి షర్మిలకు రక్షణ కల్పిస్తాం: పవన్ కల్యాణ్‌

'నన్ను అడ్డం పెట్టుకుని చేస్తున్న నీచ, నికృష్ట రాజకీయాలకు ఖండించకపోతే ప్రజలు నిజం అని నమ్మే ప్రమాదం ఉంది' అని విజయమ్మ ఆందోళన చెందారు. వాస్తవాలను, కొంత మంది దుర్మార్గపు ఉద్దేశాలను రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలనే తాను ఈ వివరణ రాస్తున్నట్లు వెల్లడించారు. 'రెండు రోజుల కిందట నా కారుకు ప్రమాదం జరిగిందని సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు. గతంలో ఎప్పుడో జరిగిన నా కారు ప్రమాదాన్ని నా కుమారుడిపై పెట్టి దుష్ప్రచారం చేయ్యడం అత్యంత జుగుప్సకరం' అని స్పష్టం చేశారు.

'రాజకీయంగా లబ్ది పొందాలనే ఈ ప్రయత్నం అత్యంత దుర్మార్గం' అని మాజీ ఎమ్మెల్యే విజయమ్మ మండిపడ్డారు. అమెరికాలో ఉన్న మనవడి దగ్గరకు వెళితే దాన్ని కూడా తప్పుగా చిత్రీకరించి.. భయపడి నేను విదేశాలకు వెళ్లినట్లు ప్రచారం చేయడం అత్యంత నీతిమాలిన చర్యగా అభివర్ణించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఇంతగా దిగజారి ప్రవర్తించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హితవు పలికారు. ఇలా దుష్ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించాలనే విధానం ఏమాత్రం సమర్ధనీయం కాదని ఖండించారు.

'ఈ నీచ సంస్కృతిని ఎటువంటి పరిస్థితుల్లోనూ సహించేది లేదు. ఇకపై ఇలాంటి దుష్ప్రచారాలను, వ్యక్తిత్వ హనన వైఖరిని ఆపితే మంచిది' అని వైఎస్‌ విజయమ్మ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఈ వికృత చేష్టలను గమనిస్తూనే ఉన్నారని.. సరైన సమయంలో సరైన రీతిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. ఇకపై ఇలాంటి లేనిపోని అసత్యాలను ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోను అంటూ వైఎస్‌ విజయమ్మ హెచ్చరించారు.|

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

Trending News