KTR Letter: రాహుల్‌ గాంధీకి కేటీఆర్‌ సంచలన లేఖ.. క్షమాపణ చెప్పాకే తెలంగాణలోకి రావాలని ఛాలెంజ్‌

KT Rama Rao Challenges To Rahul Gandhi: పదేళ్ల అభివృద్ధి, సంక్షేమ తెలంగాణను పది నెలల్లోనే రేవంత్‌ రెడ్డి విధ్వంసం చేశారని.. దీనికి కాంగ్రెస్‌ పార్టీ తరఫున రాహుల్‌ గాంధీ క్షమాపణ చెప్పాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. క్షమాపణ చెప్పే తెలంగాణలోకి అడుగుపెట్టాలని సవాల్‌ విసిరారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Nov 4, 2024, 04:27 PM IST
KTR Letter: రాహుల్‌ గాంధీకి కేటీఆర్‌ సంచలన లేఖ.. క్షమాపణ చెప్పాకే తెలంగాణలోకి రావాలని ఛాలెంజ్‌

KT Rama Rao Letter: ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా.. ప్రజలను నిండా మోసం చేసిన కాంగ్రెస్‌ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తాజాగా మరో సంచలన లేఖ రాశారు. ఈసారి ఏకంగా కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్‌ గాంధీకి లేఖ రాసి 'క్షమాపణ చెప్పి తెలంగాణలోకి రావాలి' అని ఆల్టిమేటం జారీ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం.. రాష్ట్రాన్ని అధోగతి చేసిన రేవంత్‌ రెడ్డి తరఫున క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Also Read: Waqf Board: వైఎస్సార్‌సీపీ సంచలన ప్రకటన.. మోదీకి వ్యతిరేకంగా వైఎస్‌ జగన్‌ నిర్ణయం

 

బీసీ కుల గణనపై తెలంగాణకు రానున్న రాహుల్‌ గాంధీపై మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ, రేవంత్‌ రెడ్డి పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలోకి అడుగుపెట్టకముందే తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలంటూ రాహుల్‌ గాంధీకి సోమవారం కేటీఆర్‌ లేఖ రాశారు. ఆ లేఖలో పది నెలల్లో రేవంత్‌ రెడ్డి చేసిన విధ్వంసం.. రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశారని మండిపడ్డారు.

Also Read: MP Vemireddy: 'నాకు బొకే ఇయ్యాలే'.. అలిగి స్టేజీ దిగి వెళ్లిపోయిన టీడీపీ ఎంపీ

 

'తెలంగాణలో కాంగ్రెస్ ఏడాది పాలనలో పదేళ్ల విధ్వంసం జరిగింది. తెలంగాణ ప్రజలు పిలిస్తే క్షణాల్లో వస్తానన్న రాహుల్ గాంధీ ఇన్నాళ్లు ఎక్కడ దాక్కుకున్నారు?' అని కేటీఆర్‌ ప్రశ్నించారు. 'గాంధీ భవన్‌కు కాదు ప్రజల దగ్గరకు వెళ్లే దమ్ముందా? ఆరు గ్యారంటీలు, 420 హామీల పేరుతో మోసం చేసినందుకు తెలంగాణ ప్రజలకు ముందు క్షమాపణ చెప్పు' అని కేటీఆర్‌ సవాల్ విసిరారు. ఏడాదిలోనే అన్ని వర్గాలను రోడ్డెక్కించిన ఘనత మీ ప్రభుత్వానిదేనని తెలిపారు.

'సబ్బండ వర్గాలను మోసం, నయవంచనకు గురి చేసిన పాపంలో ప్రధాన పాత్ర మీదే. మీ వైఫల్యాలు చిత్రగుప్తుడి చిట్టా అంతా ఉన్నాయి. పులకేసి మాదిరిగా మీ ముఖ్యమంత్రి ప్రజలను హింసిస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు? రాహుల్ గాంధీకి దమ్ముంటే హైడ్రా.. మూసీ బాధితులకు వద్దకు వెళ్లాలి. మీ చేతగాని పాలనతో  రైతులు, నేతన్నలు, ఆటో డ్రైవర్ల ఉసురు పోసుకున్నారు' అని కేటీఆర్‌ దుమ్మెత్తిపోశారు.

'పార్టీ ఫిరాయింపులతో రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాస్తున్న మీ ముఖ్యమంత్రికి ఎందుకు అండగా ఉన్నారు?' అని మాజీ మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. 'మీ అనుమతితోనే అదానీతో దోస్తీ, మూసీ ప్రాజెక్ట్ చేపడుతున్నారు. అభివృద్ది పథంలో ఉన్న తెలంగాణను అవీనీతి తెలంగాణాగా మార్చారు. తెలంగాణ ప్రజల తరఫున అడుగుతున్న ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి' కేటీఆర్ డిమాండ్ చేశారు. అధికారం కోసం హమీలిచ్చి సబ్బండ వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్ తరఫున తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరారు. 

'తెలంగాణకు వస్తున్న రాహుల్ గాంధీకి పచ్చగా ఉన్న తెలంగాణ మీ ఏడాది పాలనలోనే ఎలా వందేళ్ల విధ్వంసానికి గురైందో గుర్తు చేస్తున్నా' అంటూ కేటీఆర్‌ లేఖలో పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చాక తెలంగాణ ప్రజల గొంతును తడిగుడ్డతో కోశారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పది నెలల పాలనలో రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు, పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఆటోడ్రైవర్లు, చేనేత కార్మికులు, మూసీ, హైడ్రా బాధితులు ఇలా అన్ని వర్గాలను నయనంచనకు గురిచేశారని వాపోయారు.

'మా తెలంగాణ ఆగమయ్యేందుకు ప్రధాన కారణం మీరే! సూటిగా మిమ్మల్నే ప్రశ్నిస్తున్నా సమాధానం చెప్పండి. ఇచ్చిన హమీలు నెరవెర్చకుండా సబ్బండవర్గాలను మోసం చేసిన మీరు, అభివృద్ది పథంలో ఉన్న తెలంగాణను అవినీతి తెలంగాణాగా మార్చినందుకు యావత్తు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పండి' అంటూ బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News