హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా కరోనా (Covid-19) మహమ్మారి వైరస్ లక్షల సంఖ్యలో ప్రజల ప్రాణాలను బలితీసుంటుంది. ఇప్పటికే ఈ వైరస్ రూపాంతరంపై అంచనా కొరకై తీవ్ర ప్రత్నాలు, పరిశోధనలు మామ్మరం అయిన సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి అంతానికి సరైన వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రపంచ శాస్త్రవేత్తలు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో కరోనా వైరస్‌కి సంబంధించి మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఈ వైరస్ ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతుందని, గుండెపైనా ప్రభావం చూపుతున్నట్లు తాజా అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ మేరకు అమెరికన్ జర్నల్ ఆఫ్ ఎమర్జెన్సీ మెడిసిన్‌లో ప్రచురించిన ఓ అధ్యయనంలో సంచలన వివరాలు పేర్కొన్నారు.
కరోనా వైరస్ Coronavirus వల్ల కలిగే దుష్ప్రభావాలపై పలు సంస్థలు తీవ్ర స్థాయిల్లో అధ్యయనం జరుపుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో వైరస్ బారినపడి కోలుకున్న పలువురు రోగుల్లో ఇతర సమస్యలు వస్తున్నట్లు వైద్యులు గుర్తించారు. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలతో ఆస్పత్రుల్లో చేరుతున్నట్లు నిర్ధారించారు. (Cardiac Arrest) కార్డియాక్ అరెస్ట్, రక్తం గడ్డకట్టేందుకు కరోనా వైరస్ దోహదం చేస్తోందని తాజాగా అమెరికాలోని వర్జీనియా విశ్వవిద్యాలయం పరిశోధకులు జరిపిన అధ్యయనంలో అనేక విషయాలను కనుగొన్నారు. కరోనా వైరస్ నివారణకు వినియోగిస్తున్న డ్రగ్స్ గుండె సంబంధిత రోగాల మందులతో కలిస్తే వారిలో రియాక్షన్స్ కు దారితీసే ప్రమాదం ఉందని అమెరికన్ శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..