విశాఖ: విశాఖపట్నం జిల్లా ఆర్ఆర్ వెంకటాపురంలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి విషవాయువు లీకేజ్ ( Chemical gas leakage ) అయిన ఘటనలో మృతుల సంఖ్య ఐదుగురికి చేరింది. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉన్నారు. విషవాయువు చుట్టుముట్టడంతో ఊపిరాడక వందల మంది జనం తీవ్ర అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. పరిశ్రమ పరిసరాల్లోని పరిస్థితి తీవ్రత చూస్తోంటే మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని డాక్టర్లు అంచనా వేస్తున్నారు. పరిశ్రమకు 5 కిమీ దూరం వరకు విష వాయువు వ్యాపించింది. బాధితులు ఎక్కడి వాళ్లు అక్కడే అస్వస్థతకుగురై అపస్మారక స్థితిలోకి వెళ్లినట్టు సమాచారం అందుతోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, అధికార యంత్రాంగం ఘటనస్థలికి చేరుకుని బాధితులను అంబులెన్సులలో ఆస్పత్రికి తరలిస్తున్నారు. విశాఖలోని కింగ్ జార్జ్ హాస్పిటల్లో బాధితులకు చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు (NDRF forces) సైతం సహాయచర్యల్లో పాల్గొంటున్నాయి.
Also read : పవర్ స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం.. భారీ ఎత్తున ఎగిసిపడిన మంటలు
విశాఖ జిల్లాలో రసాయనాల పరిశ్రమ నుంచి విష వాయువు లీక్ అయిన ఘటనపై ఏపీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తంచేశారు. గ్యాస్ లీకేజ్ ఘటన తీవ్ర ఆందోళన సృష్టించిన నేపథ్యంలో బాధితులను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం జగన్ విశాఖ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. అక్కడి పరిస్థితిపై స్వయంగా పర్యవేక్షించి బాధితులను పరామర్శించేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ ( AP CM YS Jagan ) కాసేపట్లో విశాఖ బయల్దేరి వెళ్లనున్నారని తెలుస్తోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..