Gas Leakage at Odisha Tata Steel Plant: ఒడిషా స్టీల్ ప్లాంట్లో డేంజరస్ గ్యాస్ లీక్ అయింది. ఈ గ్యాస్ లీకేజ్ దుర్ఘటనలో 19 మంది వరకు తీవ్రంగా గాయపడినట్టు ప్రాథమిక సమాచారం అందుతోంది. ఒడిషా లోని దెంకనల్ జిల్లా మెరమండలి వద్ద ఉన్న టాటా స్టీల్ కర్మాగారంలో మంగళవారంస ఈ ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
National Pollution Control Day 2021: నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే. అంటే జాతీయ కాలుష్య నివారణ దినోత్సవం అన్నమాట. ప్రతీ ఏడాది డిసెంబర్ 2 వ తేదీన ఈ నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే జరుపుకుంటారు. ఈ ఏడాది జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవానికి మరొక రోజే మిగిలి ఉన్న నేపథ్యంలో ఈ రోజుకు ఉన్న ప్రత్యేకత, ప్రాధాన్యత, చరిత్ర నేపథ్యం ఏంటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
Visakhapatnam Fire Accident: విశాఖపట్నంలో మరో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ పరిశ్రమలో గ్యాస్ లీకై..దట్టమైన పొగలు, మంటలు చెలరేగాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా..ఆరుగురికి గాయాలయ్యాయి.
విశాఖ జిల్లాలో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్ లీకేజీ ఘటనపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. విష వాయువులు పీల్చుకున్న జనం, పసిబిడ్డలు ఎక్కడపడితే అక్కడే పడిపోయిన తీరు చూస్తే చాలా ఆందోళన కలిగించిందని అని అన్నారు.
విశాఖపట్నం జిల్లా ఆర్.ఆర్. వెంకటాపురంలోని ఎల్జీ కెమ్ పాలిమర్స్ పరిశ్రమలో విష వాయువు లీకైన ఘటనలో ( Vizag tragedy) మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. కోటి ఎక్స్గ్రేషియా అందించనున్నట్టు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ( AP CM YS Jaganmohan Reddy ) ప్రకటించారు.
మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, తదితర టాలీవుడ్ ప్రముఖులు విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమ నుంచి విష వాయువు విడుదల కావడంతో విశాఖపట్నంలో ఒక్కసారిగా అలజడి చెలరేగింది.
విశాఖపట్నం జిల్లా ఆర్ఆర్ వెంకటాపురంలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి విషవాయువు లీకేజ్ ( Chemical gas leakage ) అయిన ఘటనలో మృతుల సంఖ్య ఐదుగురికి చేరింది. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉన్నారు. విషవాయువు చుట్టుముట్టడంతో ఊపిరాడక వందల మంది జనం తీవ్ర అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది.
గోపాలపట్నం పరిధిలోని ఎల్.జి పాలిమర్స్ పరిశ్రమ నుంచి గురువారం వేకువ జామున ఈ విష వాయువులు (Visakha Gas Leakage) లీకైనట్లు సమాచారం. ఘటనపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.