Vishwak Sen Apology: సినిమా విడుదల నుంచి ప్రతిది వివాదం రేపడంతోపాటు సినిమాలో అసభ్యత తీవ్రస్థాయిలో ఉండడంతో విశ్వక్ సేన్ నటించిన సినిమాపై తీవ్ర విమర్శలు వచ్చాయి. సినిమా విడుదల తొలి షో నుంచి ప్రేక్షకుల నుంచి తీవ్ర విమర్శలు వ్యచ్చాయి. బూతు సినిమా తీశారని అభిమానులతోపాటు సాధారణ ప్రేక్షకులు ఆరోపణలు చేయగా.. విమర్శకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన సినిమాపై జరుగుతున్న వివాదం నేపథ్యంలో ఎట్టకేలకు నటుడు విశ్వక్ సేన్ బహిరంగ క్షమాపణలు చెప్పాడు. సినిమాలో బూతు తీవ్రంగా ఉండడంతో ఇకపై అలా ఉండకుండా చూసుకుంటానని ప్రకటన చేశాడు.
Also Read: Rajamouli: యాంకర్ తో రాజమౌళి ప్రేమాయణం.. వైరల్ అవుతున్న వీడియో..
'ఇటీవల నా సినిమాలు అందరూ కోరుకున్న స్థాయికి చేరుకోలేకపోయాయి. నా చివరి సినిమాకు వచ్చిన నిర్మాణాత్మక విమర్శను పూర్తిగా అంగీకరిస్తున్నా. నన్ను నమ్మి.. నా ప్రయాణాన్ని మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ నా అభిమానులకు, నాపై ఆశీర్వాదంగా నిలిచినవారికి హృదయపూర్వక క్షమాపణలు' అని విశ్వక్ సేన్ ప్రకటించాడు. తన తొలి ప్రాధాన్యం ఎప్పుడూ కొత్తదనం తీసుకురావడమేనని.. కానీ ఆ ప్రయత్నంలో ప్రేక్షకుల అభిప్రాయాలను తాను గౌరవిస్తున్నట్లు తెలిపాడు. ఇకపై తన ప్రతి సినిమా క్లాస్ లేదా మాస్ అయినా సరే అసభ్యత ఉండదని స్పష్టం చేశాడు.
Also Read: Thandel OTT Steaming date: ‘తండేల్’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..ఆ రోజు నుంచి స్ట్రీమింగ్..
'నేను ఒక చెడు సినిమా తీస్తే నన్ను విమర్శించే హక్కు పూర్తిగా మీకు ఉంది. నా ప్రయాణంలో ఎవరూ లేని సమయంలో నన్ను ప్రేమతో ముందుకు నడిపించింది మీరు (ప్రేక్షకులు). నా కెరీర్ ప్రారంభం నుంచి నేను ఎంచుకున్న కథలను మీరు ఎంతగా ప్రేమించారో తెలుసు. ఇకపై కేవలం సినిమా మాత్రమే కాదు. నా ప్రతి సన్నివేశం కూడా మీ మనసుకు తగిలేలా ఉండాలని నిర్ణయించుకున్నా' అని విశ్వక్ సేన్ వెల్లడించాడు.
తన మీద విశ్వాసం ఉంచిన నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు అందరికీ విశ్వక్ సేన్ కృతజ్ఞతలు తెలిపాడు. 'నా కథానాయకులు, దర్శకులు, రచయితలు నా వెన్నెముకగా నిలిచి, నన్ను మలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు' అని విశ్వక్ సేన్ చెప్పాడు. త్వరలోనే మరొక బలమైన కథతో ముందుకు వస్తానని విశ్వక్ ప్రకటించాడు. 'నా మంచి, చెడు కాలాల్లో నన్ను నమ్మి నిలబెట్టుకున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. మీ మద్దతు నాకు ఎంతో ప్రాముఖ్యం' అని లేఖలో విశ్వక్ సేన్ తెలిపాడు.
ప్రతిదీ వివాదం
ఫిబ్రవరి 14వ తేదీన 'లైలా' సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఆడ వేషంలో విశ్వక్ ప్రత్యేకంగా కనిపించగా.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఓ నటుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపగా.. సినిమాను బహిష్కరించాలనే డిమాండ్ మొదలైంది. అనంతరం సినిమా విడుదలయ్యాక సినిమాలోని కంటెంట్‌పై ప్రేక్షకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బూతు సినిమాగా లైలా ఉందని విమర్శలు చేశారు. దీనికితోడు సినిమా బాగాలేకపోవడంతో లైలాకు అతి తక్కువ రేటింగ్ లభించగా.. కలెక్షన్లు రాలేదు. ప్రేక్షకులు సినిమాకు దూరంగా ఉన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి