Cheap and Best Cars: కార్ల వినియోగంలో కస్టమర్ల ప్రాధాన్యతలు మారుతున్నాయి. సేఫ్టీ, మైలేజ్, మెయింటెనెన్స్‌పై దృష్టి పెడుతున్నారు. ఇంకొందరైతే సెడాన్ లేదా హ్యాచ్‌బ్యాక్ కంటే ఎస్ యూవీ కార్లు బెస్ట్ అనుకుంటున్నారు. అటు బడ్జెట్ కూడా అనుకూలంగా ఉండాల్సిందే. అందుకే మీ కోసం 7 లక్షల బడ్జెట్‌లో బెస్ట్ ఫీచర్లు ఉన్న కార్ల గురించి వివరాలు అందిస్తున్నాం.
Hyundai Grand i10 Neos
ఇది వాస్తవానికి చిన్న కారే అయినా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇందులో సేఫ్టీ ఫీచర్లు ఎక్కువ. 6 ఎయిర్‌బ్యాగ్స్ ఉంటాయి. టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, పార్కింగ్ కెమేరా, స్టైలిష్ డిజైన్ ఈ కారు ప్రత్యేకతలు. ఈ కారు ఇంజన్ 82 బీహెచ్‌పి పవర్, 114 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర 5.92 లక్షలు.
Maruti Suzuki Celerio
ఈ కారు మెయింటెనెన్స్ చాలా తక్కువ. ఇందులో కూడా 6 ఎయిర్‌బ్యాగ్స్ ఉంటాయి. 3 పాయిట్ సీట్ బెల్ట్, హిల్ హోల్డ్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, రివర్స్ పార్కింగ్ సెన్సార్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు ఇంజన్ 67 బీహెచ్‌పి పవర్, 89 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర 5.64 లక్షలు.
Nissan Magnite
ఈ కారు ఇంజన్ 71 బిహెచ్‌పి పవర్, 96 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. రెండవ ఇంజన్ 1.0 లీటర్ టర్బో పెట్రోల్, 99 బీహెచ్‌పి పవర్, 160 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మొత్తం 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. 360 డిగ్రీల కెమేరా, టైర్ ప్రెషర్ మోనిటరింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర 6.12 లక్షలు
Hyundai Exter
ఇది మినీ ఎస్‌యూవీ కేటగరీలో వస్తుంది. ఇందులో కూడా 6 ఎయిర్‌బ్యాగ్స్, డాష్ కామ్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు ఇంజన్ 82 బీహెచ్‌పి వపర్, 113.8 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర 6.13 లక్షలతో ప్రారంభమౌతుంది
Citroen C3
ఈ మధ్యనే ఇండియాలో ఎంట్రీ ఇచ్చింది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్, ఈబీడీ, హిల్ హోల్డ్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు ఇంజన్ 82 బీహెచ్‌పి పవర్, 115 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. రెండవది టర్బో పెట్రోల్ ఇంజన్. 109 బీహెచ్‌పి పవర్, 190 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర 6.16 లక్షలు
Also read: Tesla EV Car: టెస్లా ఈవీ వచ్చేస్తోంది. ఏప్రిల్ నుంచి అమ్మకాలు, ధర ఎంతంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి