Kalvakuntla Kavitha: కృష్ణా జలాలు ఆంధ్రప్రదేశ్ దోచేస్తుందని.. ప్రధాని మోదీతో కలిసి చంద్రబాబు నాయుడు నీళ్లు తరలించుకుంటూ వెళ్తున్నారు. ఏపీ జల దోపిడీ చేస్తుంటే రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేస్తున్నారు' అని బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిలదీశారు. వెంటనే ఏపీ జల దోపిడీని అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల నిర్వహణపై.. జలాల వినియోగంపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Pending DAs: 'ప్రభుత్వ ఉద్యోగులకు 4 డీఏలు, 2వ పీఆర్‌సీ ఎప్పుడు?'
సూర్యాపేట జిల్లా పర్యటనలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బిజీబిజీగా గడిపారు. పట్టణంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కవిత మాట్లాడారు. ఈ సందర్భంగా పాలనలో వైఫల్యమైన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'సాగుకు నీళ్లివ్వక రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి రైతుల ఉసురు తగులుతుంది' అని తెలిపారు. వెంటనే మేడిగడ్డ ప్రాజెక్టును వినియోగంలో తేవాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.
Also Read: Bandi Sanjay: 'ఎక్కువ రోజులు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీలో ఉండడు'
'ప్రభుత్వానికి జల విధానం లేదా?. తెలంగాణ నీళ్లు మలపాలన్న సోయి లేని వ్యక్తి రేవంత్ రెడ్డి. మేడిగడ్డను వాడుకోక తెలంగాణను ఎండబెడుతున్నారు' అని మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత మండిపడ్డారు. 'ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 199 టీఎంసీలతో బనకచర్లలో ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. రేవంత్ రెడ్డి మాత్రం నాగార్జున సాగర్‌ను కూడా మన ఆధీనంలోకి తీసుకురాలేకపోయారు' అని మండిపడ్డారు.
కాళేశ్వరం ద్వారా సూర్యాపేట జిల్లాలో గోదావరి జలాలను పారించిన ఘనత కేసీఆర్ అని ఎమ్మెల్సీ కవిత గుర్తుచేశారు. కృష్ణా పరీవాహక ప్రాంతంలోనూ గోదావరి నుంచి నీళ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్‌ది అని తెలిపారు. కేసీఆర్ హయాంలో కోదాడ నియోజకవర్గానికి కాళేశ్వరం ద్వారా లక్షా 22 వేల ఎకరాలకు నీళ్లు అందించారని చెప్పారు. ఇప్పుడు నీళ్లు ఎందుకు తేవడం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎమ్మెల్సీ కవిత సవాల్ చేశారు. ఇప్పుడు నీళ్లు ఎందుకు తేవడం లేదు? మేడిగడ్డ పాడయిందా? అని ప్రశ్నించారు. 'రాజకీయ కక్షతోనే మేడిగడ్డ ప్రాజెక్టును వినియోగించడం లేదని ఇంజనీర్లు చెబుతున్నారు. మరో 40 రోజుల పాటు నీళ్లు ఇస్తేనే పంటలు చేతికొచ్చే అవకాశం ఉంటుంది' అని కవిత తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.