Devi Sri Prasad Copied Songs: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సంగీత దిగ్గజంగా గుర్తింపు తెచ్చుకున్నారు దేవిశ్రీప్రసాద్. ఎప్పటికప్పుడు అద్భుతమైన ట్రాక్ అందిస్తూ అదిరిపోయే బీజీయంతో అందరినీ ఆకట్టుకుంటూ ఉంటారు. ముఖ్యంగా లవ్ , ఎమోషనల్, రొమాంటిక్ సన్నివేశాలకు, అలాంటి పాటలకు ఈయన ఇచ్చే మ్యూజిక్ ప్రత్యేకమనే చెప్పాలి.
రీసెంట్ గా చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం తండేల్ . ఇందులో వచ్చిన బుజ్జి తల్లి పాట ఎంత పాపులారిటీ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యూట్యూబ్ లోనే కాదు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈపాటే వైరల్ గా మారడం గమనార్హం.
ఈ పాట మ్యూజిక్ ట్రాక్ కి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. డీఎస్పీ అందించిన మ్యూజిక్ కి ప్రతి ఒక్కరు శభాష్ అంటూ మెచ్చుకోవడమే కాకుండా ఆయన అందించిన మ్యూజిక్ ట్రాక్ వింటూ పరవశించి పోతున్నారు.
అయితే ఇలాంటి సమయంలో ఒక ఇంస్టాగ్రామ్ వీడియో అందరిలో అనుమానాలు రేకెత్తిస్తోంది. డిఎస్పి పై ఎంతో నమ్మకం పెట్టుకున్న అభిమానులకు ఈ వీడియో చాలా నిరాశను మిగిల్చిందని చెప్పవచ్చు. ఇది చూసిన చాలామంది డిఎస్పి .. నీ పైన పెట్టుకుని నమ్మకాన్ని కోల్పోతున్నావా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇక వీడియోలో ఏముందని విషయానికొస్తే.. తండేల్ సినిమాలో బుజ్జి తల్లి పాటకు అందించిన ట్రాక్ ను గతంలో త్రిష - సిద్ధార్థ నటించిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలోని చంద్రులో ఉండే కుందేలు కిందికి వచ్చిందా పాటకి సేమ్ మ్యూజిక్ ట్రాక్ వహించడం జరిగింది. అంతేకాదు ఇలియానా - సిద్ధార్థ నటించిన ఆట సినిమాలో హోయ్ న ఏం చాందిని రా అనే పాట మ్యూజిక్ కూడా సేమ్ గా అనిపిస్తోంది . మొత్తానికైతే ఒక్క మ్యూజిక్ ట్రాక్ తో మూడు పాటలను కవర్ చేశాడు అని నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.
Also Read: Viral Video: వెన్నులో వణుకు పుట్టిస్తున్న వీడియో.. రెప్పపాటులో ఘోర ప్రమాదం నుంచి బైటపడ్డ బుడ్డొడు..
Also Read: One Nation One Gold Rate: గోల్డ్ రేట్స్ ను కంట్రోల్ చేసేందుకు మాస్టర్ ప్లాన్..అదేంటో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.