8th Pay Commission Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురు చూసిన 8వ వేతన సంఘం ప్రక్రియ మొదలు కానుంది. ఈ క్రమంలో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎంప్లాయిస్ స్టాండింగ్ కమిటీ సమావేశం ఇటీవల ముగిసింది. ఈ క్రమంలో ఉద్యోగుల నుంచి కొన్ని కీలకమైన డిమాండ్లు తెరపైకి వచ్చాయి.
8వ వేతన సంఘం ఏర్పాటుకు సంబంధించిన విధి విధానాలు, మార్గదర్శకాలు, ఉద్యోగుల డిమాండ్లపై చర్చ జరిగింది. అదే సమయంలో పెన్షన్ విధానంపై ప్రస్తావన వచ్చింది. పాత పెన్షన్ విధానం తిరిగి అమలు చేయాలని ఉద్యోగుల నుంచి ప్రతిపాదన వచ్చింది. కనీస వేతనం విషయంలో నిత్యావసర వస్తువులు, జీవన ప్రమాణాలను పరిగణలో తీసుకోవాలని ఉద్యోగులు కోరారు. అదే సమయంలో పాత పెన్షన్ విధానాన్ని తిరిగి పునరుద్ధరించాలని ప్రధానంగా విన్పించింది. న్యూ పెన్షన్ సిస్టమ్ తొలగించాలని చాలా కాలంగా ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ నుంచి కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రారంభించనున్న యూనిఫైడ్ పెన్షన్ సిస్టమ్ కూడా వద్దంటున్నారు.
మరోవైపు ఉద్యోగులు వేతన విదానం, అలవెన్సులు, ఇతర ప్రయోజనాల గురించి చర్చ జరిగింది. 15వ అఖిల భారత కార్మిక సమావేశాన్ని పరిగణలో తీసుకుని వేతన విధానం, ప్రయోజనాలు, సౌకర్యాలు, రిటైర్మెంట్ ప్రయోజనాలు, సంక్షేమం వంటివి నిర్ణయించాలని కోరారు.
అన్నింటికంటే ముఖ్యంగా 8వ వేతన సంఘంలో వేతన స్కేల్స్ విలీనంపై చర్చ జరిగింది. పే స్కేల్ 1, 2ల విలీనం, పే స్కేల్ 3,4 విలీనం, పే స్కేల్ 5,6 విలీనం ఉండాలనే సిఫార్సు ఎక్కువగా ఉంది. పే స్కేల్స్ విలీనం వల్ల ఉద్యోగులకు గణనీయంగా ప్రయోజనం కలుగుతుంది. కనీస వేతనం ఒక్కసారిగా పెరుగుతుంది.
Also read: e Flying Boat: చెన్నై- కోల్‌కతా 16 వందల కిలోమీటర్లు 3 గంటల్లోనే, ఇ ఫ్లయింగ్ బోట్ ఆవిష్కరణ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి